అరవింద్ కేజ్రీవాల్: వార్తలు
15 Mar 2023
దిల్లీ'పాత ఎక్సైజ్ పాలసీ'ని మరో 6నెలలు పొడిగించిన దిల్లీ ప్రభుత్వం
'పాత ఎక్సైజ్ పాలసీ'ని దిల్లీ ప్రభుత్వం మరో ఆరు నెలల పాటు పొడిగించింది. ఈ లోగా కొత్త ఎక్సైజ్ పాలసీని సిద్ధం చేయాలని అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం సంబంధిత అధికారులను ఆదేశించింది.
01 Mar 2023
దిల్లీదిల్లీ ప్రభుత్వంలో కొత్త మంత్రులు; సౌరభ్ భరద్వాజ్, అతిషికి అవకాశం
సత్యేందర్ జైన్, మనీష్ సిసోడియా తమ మంత్రి పదవులకు రాజీనామా చేసిన తర్వాత వారి స్థానంలో సౌరభ్ భరద్వాజ్, అతిషిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం కేజ్రీవాల్ నిర్ణయించారు. ఈ మేరకు వారి పేర్లను లెఫ్టినెంట్ గవర్నర్‌కు పంపారు.
01 Mar 2023
దిల్లీసిసోడియా, సత్యేందర్ జైన్ రాజీనామా; 2013 నాటి కేజ్రీవాల్ ట్వీట్‌ను వెలికితీసిన బేజేపీ
ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ తమ మంత్రి పదవులకు రాజీనామా చేయడం, ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వాటిని ఆమోదించిన నేపథ్యంలో దిల్లీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.
28 Feb 2023
దిల్లీదిల్లీ మద్యం కుంభకోణం: అరెస్టుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన మనీష్ సిసోడియా
లిక్కర్ పాలసీ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
27 Feb 2023
దిల్లీమనీష్ సిసోడియా అరెస్టును సీబీఐ అధికారులే వ్యతిరేకిస్తున్నారు: కేజ్రీవాల్
దిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆప్ అధినేత, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. సిసోడియా అరెస్ట్ రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే జరిగిందని చెప్పారు.
26 Feb 2023
దిల్లీదిల్లీ మద్యం కేసులో మనీష్ సిసోడియాను అరెస్టు చేసిన సీబీఐ
దిల్లీ మద్యం కుంభకోణం కేసులో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ ఆప్ కీలక నేత, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ ఆదివారం రాత్రి అరెస్టు చేసింది. ఉదయం నుంచి తొమ్మిది గంటలకు పైగా మనీష్ సిసోడియాను సీబీఐ విచారించింది. అనంతరం అదుపులోకి తీసుకుంది.
26 Feb 2023
దిల్లీDelhi Excise Policy Scam: నేను జైలుకు వెళ్లాల్సి వచ్చినా భయపడను: మనీష్ సిసోడియా
దిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసు విచారణలో సీబీఐకి పూర్తిగా సహకరిస్తామని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తెలిపారు. ఆదివారం సీబీఐ కార్యాలయానికి వెళ్లే ముందు ట్విట్టర్ వేదికగా స్పందించారు.
23 Feb 2023
దిల్లీదిల్లీ మద్యం కుభకోణం: సీఎం కేజ్రీవాల్ పర్సనల్ అసిస్టెంట్‌ను ప్రశ్నించిన ఈడీ
దిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణానికి సంబంధించి సీఎం అరవింద్ కేజ్రీవాల్ పర్సనల్ అసిస్టెంట్ బిభవ్ కుమార్‌ను గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించింది.
02 Feb 2023
దిల్లీదిల్లీ లిక్కర్ స్కామ్: రెండో చార్జ్‌షీట్‌లో దిల్లీ సీఎం కేజ్రీవాల్, కవిత పేర్లు
దిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈడీ గురువారం దాఖలు చేసిన రెండో చార్జ్‌షీట్‌లో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేరు ఉండటం గమనార్హం. రెండో చార్జ్‌షీట్‌లోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ సీఎం కవిత, వైసీపీ ఎంపీ మాగుంట బాబుతో పాటు మొత్తం 12మంది పేర్లను ఈడీ ఇందులో చేర్చింది.
20 Jan 2023
దిల్లీదిల్లీ: 'మీకు వడ్డించడం అంటే చాలా ఇష్టం', కేజ్రీవాల్‌కు లెఫ్టినెంట్ గవర్నర్ కౌంటర్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా మధ్య మాటల యుద్ధం రోజుకు రోజుకు పెరుగుతోంది. ఇటీవల గవర్నర్‌పై కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు? ఆయన ఎక్కడి నుంచి వచ్చారు? ఎల్జీని కలిసేందుకు తనకు అవకాశం ఇవ్వడం లేదని ఆరోపణలు చేశారు. ఈ ప్రశ్నలపై సమాధానంగా శుక్రవారం లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా.. కేజ్రీవాల్‌కు లేఖ రాశారు.
18 Jan 2023
భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్కేసీఆర్ మాకు పెద్దన్నలాంటి వారు: దిల్లీ సీఎం కేజ్రీవాల్
భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్‌పై దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, కేరళ సీఎం పినరయి విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ప్రశంసలు కురించారు. కేసీఆర్ తమకు పెద్దన్న లాంటి వారని కేజ్రీవాల్ అభివర్ణించారు. ఇక్కడి పథకాలు అద్భుతమని, కంటి వెలుగు పథకాన్ని దిల్లీ, పంజాబ్ లలో అమలు చేస్తామని ప్రకటించారు.
12 Jan 2023
ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్ఆమ్ ఆద్మీ పార్టీకి ఝలక్: ప్రకటనల సొమ్ము రూ. 163కోట్లు చెల్లించాలని డీఐపీ నోటీసులు
దిల్లీలో అధికార పార్టీ అయిన 'ఆప్'కు డీఐపీ విభాగం షాకిచ్చింది. ప్రకటన కోసం వినియోగించిన రూ.163కోట్లు చెల్లించాలని ఆమ్ ఆద్మీ పార్టీకి నోటీసులు జారీ చేసింది.
09 Jan 2023
దిల్లీదిల్లీ లిక్కర్ స్కామ్ కేసు వాదించేందుకు లాయర్లకు ఆప్ ప్రభుత్వం రూ.కోట్ల ఫీజు చెల్లింపు
దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ కేసులో సంబంధించి కోర్టులో హాజరవుతున్న న్యాయవాదులకు ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని దిల్లీ ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.25.25 కోట్లు చెల్లించినట్లు అధికార వర్గాలు తెలిపారు.