Page Loader
Arvind Kejriwal: సుప్రీంకోర్టు తీర్పు.. కేజ్రీవాల్‌ రాజీనామాకి బీజేపీ డిమాండ్‌ 
సుప్రీంకోర్టు తీర్పు.. కేజ్రీవాల్‌ రాజీనామాకి బీజేపీ డిమాండ్‌

Arvind Kejriwal: సుప్రీంకోర్టు తీర్పు.. కేజ్రీవాల్‌ రాజీనామాకి బీజేపీ డిమాండ్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 13, 2024
01:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో, ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఈ బెయిల్ కొన్నిరకాల షరతులతో కూడి ఉంది. సుప్రీం కోర్టు కేజ్రీవాల్‌కు ఆదేశాలు జారీ చేసింది, కేసుకు సంబంధించిన వ్యాఖ్యలు చేయకూడదని, ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లరాదని, అలాగే అధికారిక పత్రాలపై సంతకాలు చేయకూడదని స్పష్టం చేసింది. రూ.10 లక్షల బాండ్లు, ఇద్దరి పూచీకత్తుతో ఈ బెయిల్ మంజూరు చేసింది. కేజ్రీవాల్‌కు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. అయితే, కేజ్రీవాల్‌ బెయిల్‌పై ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా కీలక వ్యాఖ్యలు చేశారు. సుప్రీం కోర్టు కేజ్రీవాల్ అరెస్టును చట్టబద్ధమైనదిగా గుర్తించిందని, అతనిపై ఉన్న అభియోగాలు సరైనవని చెప్పారు.

వివరాలు 

కేజ్రీవాల్‌కు సిఎం హోదాలో కొనసాగేందుకు హక్కు లేదు: సచ్‌దేవా 

కేజ్రీవాల్‌కు బెయిల్ రావడం పెద్ద ఆశ్చర్యకర విషయం కాదని, విచారణ ఇంకా కొనసాగుతుందని తెలిపారు. త్వరలోనే కేజ్రీవాల్‌ శిక్ష అనుభవించే అవకాశం ఉందని, జయలలిత, లాలూ యాదవ్, మధుకోడా వంటి నాయకులతో సమానంగా కేజ్రీవాల్ పేరును చేర్చవచ్చని వ్యాఖ్యానించారు. అంతేకాక, సచ్‌దేవా కేజ్రీవాల్‌కు సిఎం హోదాలో కొనసాగేందుకు హక్కు లేదని అన్నారు. ముఖ్యమంత్రి బాధ్యతలను నిర్వర్తించలేని స్థితిలో ఉన్నప్పుడు ఆ పదవిలో ఎందుకు కొనసాగుతున్నారని ప్రశ్నించారు. మరో బీజేపీ నేత గౌరవ్ భాటియా మాట్లాడుతూ..అవినీతి ఆరోపణలతో కేజ్రీవాల్‌కు షరతులతో కూడిన బెయిల్ లభించిందని, కేజ్రీవాల్ ఇంతకుముందు జైలుకు వెళ్లిన ముఖ్యమంత్రి అని గుర్తు చేశారు. ఇప్పుడాయన బెయిల్ పొందిన సిఎం అయ్యారని చెప్పారు. కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేయాలని కోరారు.