Page Loader
Arvind Kejriwal: దిల్లీ సీఎం అతిశీ అరెస్టుకు ప్లాన్ చేసిన కేంద్రం.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు
దిల్లీ సీఎం అతిశీ అరెస్టుకు ప్లాన్ చేసిన కేంద్రం.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

Arvind Kejriwal: దిల్లీ సీఎం అతిశీ అరెస్టుకు ప్లాన్ చేసిన కేంద్రం.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 25, 2024
11:42 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, దిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన త్వరలో దిల్లీ సీఎం అతిశీని అరెస్ట్‌ చేయనున్నారని తెలిపారు. ఈ అంశంపై కేజ్రీవాల్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. తాజాగా దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో, ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం రెండు రోజుల క్రితం మహిళా సమ్మాన్ యోజన, సంజీవన యోజన పథకాలను ప్రకటించింది. ఈ పథకాలు కొంతమందికి నచ్చలేదని కేజ్రీవాల్ ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో సీఎం అతిశీని తప్పుడు కేసులో అరెస్ట్‌ చేయాలని కుట్ర పన్నుతున్నారని కేజ్రీవాల్ పేర్కొన్నారు. అంతేకాకుండా ఆప్‌ నేతల ఇళ్లలో సోదాలు కూడా జరగొచ్చని ఆయన భావించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ట్వీట్ చేసిన కేజ్రీవాల్