Arvind Kejriwal: బీజేపీ గెలిస్తే ఢిల్లీలో అన్ని సేవలు ఆగిపోతాయి.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో దేశ రాజధానిలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ముఖ్యంగా బీజేపీ, ఆప్ మధ్య తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి.
ఇప్పటికే యమునా నది నీటి విషయంలో రెండు పార్టీల నేతలు వాదనలు కూడా సంచలనంగా మారింది.
ఈ నేపథ్యంలో ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
అరవింద్ కేజ్రీవాల్ ఓ వీడియో విడుదల చేసి, దిల్లీ ఎన్నికల్లో ఆప్ ఓడిపోతే, ఉచిత కరెంటు, నీరు, నాణ్యమైన విద్య, ఆరోగ్య సేవలు అందించడం ఆగిపోతుందని స్పష్టం చేశారు.
అలాగే బీజేపీ వీటన్నింటిని ఆపేస్తుందని, ఇంకా నెలకు రూ.25 వేల ఖర్చు పెరుగుతుందన్నారు.
Details
ఫిబ్రవరి 8న ఫలితాలు
బీజేపీ పాలనలో ప్రభుత్వ పాఠశాలలు ఎలా ఉంటాయో, 24 గంటల కరెంటు ఉందా, లేదో చూడాలని ఆయన అన్నారు.
కేజ్రీవాల్ బీజేపీ ప్రయోజనాల గురించి కాకుండా ప్రజల కుటుంబాల గురించి ఆలోచన చేయాలని సూచించారు.
ఆయన ఈ వ్యాఖ్యలు చేయడంతో కొత్త చర్చకు దారి తీశాయి. కొద్దిరోజులుగా యమునా నది నీటి విషయంలో హర్యానా, ఢిల్లీ ప్రభుత్వాల మధ్య మాటల యుద్దం నడుస్తోంది.
ఆప్ నేతలు యమునా నదిలో విషం కలిపారని ఆరోపించిన విషయంపై బీజేపీ నేతలు కౌంటరిచ్చారు. దిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనున్నాయి, ఫిబ్రవరి 8న ఫలితాలు వెల్లడయ్యే అవకాశముంది.