Page Loader
Delhi Assembly Elections: దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు 699 మంది పోటీకి సిద్ధం.. అత్యధికంగా న్యూదిల్లీలో..!
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు 699 మంది పోటీకి సిద్ధం.. అత్యధికంగా న్యూదిల్లీలో..!

Delhi Assembly Elections: దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు 699 మంది పోటీకి సిద్ధం.. అత్యధికంగా న్యూదిల్లీలో..!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 21, 2025
05:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధాని దిల్లీలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల కోసం 699 మంది అభ్యర్థులు బరిలో నిలిచారని ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. 2020 అసెంబ్లీ ఎన్నికలలో 672 మంది అభ్యర్థులు పోటీ చేయగా, ఈసారి ఆ సంఖ్య మరింత పెరిగిందని అధికారులు తెలిపారు. ఎన్నికల ప్రధాన అధికారి వెల్లడించిన సమాచారం ప్రకారం, ఈసారి 981 మంది అభ్యర్థులు 1522 నామినేషన్ పత్రాలు దాఖలు చేసినట్లు తెలిపారు. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ గడువు ముగిసిన తరువాత, బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించారు.

Details

జనక్ పురి స్థానానికి 16 మంది పోటీ

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ, కాంగ్రెస్ అభ్యర్థి సందీప్ దీక్షిత్ పోటీ చేస్తున్న న్యూదిల్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 23 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. జనక్‌పురిలో 16మంది, రోహ్తాస్‌నగర్, కర్వాల్‌నగర్, లక్ష్మీనగర్‌లలో 15మంది చొప్పున పోటీ చేస్తున్నారు. అత్యల్పంగా అభ్యర్థుల సంఖ్య పటేల్‌నగర్, కస్తూర్బా నగర్‌లలో కేవలం ఐదుగురే ఉన్నారని ఎన్నికల అధికారులు తెలిపారు. మొత్తం 70 నియోజకవర్గాల్లో 38 స్థానాల్లో 10 మందికి తగ్గట్టు అభ్యర్థులు బరిలో నిలిచారు. తిలక్‌నగర్, మంగోల్‌పురి, గ్రేటర్ కైలాస్ నియోజకవర్గాల్లో ఆరుగురు అభ్యర్థులు పోటీలో ఉండగా, చాందినీ చౌక్, రాజేంద్రనగర్, మాలవీయనగర్‌లలో ఏడుగురు చొప్పున పోటీ చేస్తున్నారు.