Page Loader
Amit Shah: కేజ్రీవాల్ దుబారా ఖర్చులపై బీజేపీ ఆగ్రహం.. దిల్లీలో ముదిరిన రాజకీయ వేడి
కేజ్రీవాల్ దుబారా ఖర్చులపై బీజేపీ ఆగ్రహం.. దిల్లీలో ముదిరిన రాజకీయ వేడి

Amit Shah: కేజ్రీవాల్ దుబారా ఖర్చులపై బీజేపీ ఆగ్రహం.. దిల్లీలో ముదిరిన రాజకీయ వేడి

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 04, 2025
05:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధాని దిల్లీలో రాజకీయాలు వేడక్కాయి. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఇప్పటికే అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, బీజేపీ శనివారం 29 మంది అభ్యర్థులతో తన తొలి జాబితాను విడుదల చేసింది. కాంగ్రెస్ కూడా కొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇదే సమయంలో విమర్శలు, ప్రతివిమర్శలతో ఢిల్లీలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ ఆప్ నాయకత్వాన్ని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు. ఆప్‌ను దేశ రాజధానిని దశాబ్ద కాలంగా పట్టిపీడిస్తున్న విపత్తుగా అభివర్ణించారు. కేజ్రీవాల్ అభివృద్ధి పేరుతో ప్రజలపై నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు.

Details

అమిత్ షా లక్ష్యంగా కేజ్రీవాల్ విమర్శలు

కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా కేజ్రీవాల్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. కేజ్రీవాల్ అధికారిక నివాసంపై విపరీతంగా ఖర్చు చేశారని, ప్రభుత్వ సొమ్ముతో అద్దాల రాజభవనం నిర్మించుకున్నారని అమిత్ షా అన్నారు. కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజల కోసం ఏమీ చేయలేదని, అతను విలాసవంతమైన జీవితాన్ని గడపడం కోసం ప్రజల సొమ్మును వృథా చేశారని విమర్శలు గుప్పించారు. బీజేపీ విమర్శలను ఆప్ అధినేత కేజ్రీవాల్ తీవ్రంగా ఖండించారు. గత 10 ఏళ్లలో బీజేపీ దిల్లీలో ఒక్క మంచి పని కూడా చేయలేదని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక 22,000 తరగతి గదులు, మూడు విశ్వవిద్యాలయాలు, పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.

Details

మొదటి జాబితా రిలీజ్ చేసిన బీజేపీ

బీజేపీ నాయకత్వం ప్రజలకు చేయాల్సిన వాగ్దానాలను గాలిలో కలిపిందని, తమ పాలనలో ప్రజల అవసరాలను తీర్చడానికి అనేక చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇక బీజేపీ శనివారం 29 మంది అభ్యర్థులతో తొలిజాబితాను విడుదల చేసింది. గత ఏడాది పీడబ్ల్యుడీ విడుదల చేసిన నివేదిక ప్రకారం, కేజ్రీవాల్ అధికారిక నివాసంలో విలాసవంతమైన పునర్నిర్మాణాలు, ఖరీదైన ఉపకరణాలు ఉన్నాయని పేర్కొంది.