
Arvind Kejriwal-Bhagwant Mann: పంజాబ్‌లో ప్రభుత్వ మార్పు వార్తల వేళ.. ఆప్ అధినేత, పంజాబ్ సీఎం సమావేశం
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే.
అంతే కాకుండా, పంజాబ్‌లో ప్రభుత్వ మార్పు సంభవించవచ్చన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.
ఈ పరిస్థితుల్లో ఆప్ ప్రధాన నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) మంగళవారం కీలక సమావేశాన్ని నిర్వహించారు.
దేశ రాజధానిలోని కపుర్తలా హౌస్‌లో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఆ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలతో ఆయన సమావేశమయ్యారు.
వివరాలు
భగవంత్ మాన్, కేజ్రీవాల్ మధ్య అంతర్గత పోరు
పంజాబ్ ఆప్ యూనిట్‌లో అంతర్గత విభేదాలు ఉన్నాయన్న వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
ఇదే సమయంలో, సుమారు 30 మంది ఎమ్మెల్యేలు తనతో సంప్రదింపుల్లో ఉన్నారని కాంగ్రెస్ నేత ప్రతాప్‌సింగ్ బజ్వా సంచలన వ్యాఖ్యలు చేశారు.
అయితే, ఆ వ్యాఖ్యలను ఆప్ ఎంపీ మాల్విందర్ సింగ్ ఖండించారు. కనీసం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఆయనతో టచ్‌లో లేరని దుయ్యబట్టారు.
ఇటీవల జరిగిన దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో ఆప్ అధికారాన్ని కోల్పోయింది.
ఈ పరాజయం తర్వాత భగవంత్ మాన్, కేజ్రీవాల్ మధ్య అంతర్గత పోరు పెరిగిందని బజ్వా అభిప్రాయపడ్డారు.
అంతేగాక, ఆప్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని కూడా అన్నారు.
వివరాలు
కేజ్రీవాల్, భగవంత్ మాన్ భేటీకి ప్రాధాన్యం
తన సోదరుడే బీజేపీలో చేరినప్పుడు బజ్వా అడ్డుకోవలేకపోయారని మాల్విందర్ వ్యంగ్యంగా అన్నారు.
ఒకవైపు కాంగ్రెస్ నేతలు తమ పార్టీని వీడుతుంటే, బజ్వా మాత్రం ఆప్ ఎమ్మెల్యేలపై ఆసక్తి కనబరుస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
ఈ రాజకీయ పరిణామాల మధ్య కేజ్రీవాల్, భగవంత్ మాన్ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.
అయితే, ఏకీభవన సమావేశాలు పార్టీల్లో సాధారణమేనని, భవిష్యత్తు కార్యాచరణ గురించి చర్చించేందుకే ఈ సమావేశం నిర్వహించినట్లు ఆప్ నేతలు స్పష్టం చేశారు.