
Arvind Kejriwal: కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై 13న సుప్రీం తీర్పు
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మద్యం విధానానికి సంబంధించిన సీబీఐ కేసులో ఇంకా రిలీఫ్ లభించలేదు.
ఈ కేసులో ఆయన వేసిన బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇటీవల తీర్పును రిజర్వ్ చేసింది, శుక్రవారం ఈ తీర్పు వెలువడనున్నట్లు సుప్రీం కోర్టు వెబ్‌సైట్‌లో తీర్పు తేదీని వెల్లడించారు.
దిల్లీ మద్యం విధానానికి సంబంధించిన సీబీఐ కేసులో తన అరెస్టును సవాల్ చేస్తూ, కేజ్రీవాల్ రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు.
ఈ పిటిషన్లపై ఇటీవల సుప్రీం కోర్టులో విచారణ జరిగింది.ఈ విచారణలో కేజ్రీవాల్ తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి, సీబీఐ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
వివరాలు
మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్ అరెస్టు
''మద్యం విధానంపై కేసు నమోదైన తర్వాత రెండేళ్ల పాటు సీఎంను అరెస్టు చేయలేదు. కానీ, ఈడీ కేసులో బెయిల్ వచ్చిన తర్వాత సీబీఐ వెంటనే 'ఇన్స్యూరెన్స్ అరెస్టు'కి దిగింది, అలాగే, అరెస్టుకు ముందు ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వలేదు'' అని ఆయన వాదించారు.
ఇదిలా ఉండగా, సీబీఐ మాత్రం కేజ్రీవాల్‌కి బెయిల్ ఇవ్వడానికి వ్యతిరేకంగా వాదనలు వినిపించింది.
కేజ్రీవాల్ బెయిల్ కోసం నేరుగా హైకోర్టుకు వెళ్లి, సెషన్స్ కోర్టుకు వెళ్లలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఇరువైపుల వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.
ఈ ఏడాది మార్చి 21న మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.