Excise scam: కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు.. ఆప్ దుర్గేష్ పాఠక్ కు బెయిల్
దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్‌కు బెయిల్ లభించింది. సమన్లకు స్పందించిన దుర్గేష్ పాఠక్ కోర్టులో ప్రవేశించారు. దీని తర్వాత రూ.లక్ష బాండ్ చెల్లించి బెయిల్ పొందాడు. ఎమ్మెల్యేకు ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు దుర్గేష్ పాఠక్, ఇతరులకు లక్ష రూపాయల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. ఆగస్టు 12న, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22 కుంభకోణానికి సంబంధించిన అవినీతి కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, దుర్గేష్ పాఠక్‌లను ప్రాసిక్యూట్ చేయడానికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)ని కోర్టు అనుమతించింది.
సెప్టెంబర్ 25 వరకు కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ
అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని సెప్టెంబర్ 25 వరకు పొడిగించారు. కస్టడీలో ఉన్న అతడిని, ఇతర నిందితులను తీహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరిచారు. ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సీనియర్ సభ్యుడు పాఠక్,కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడిగా పరిగణించబడుతున్నారు. ఆరోపించిన ఎక్సైజ్ పాలసీ స్కామ్‌కు సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు బుధవారం సెప్టెంబర్ 25 వరకు పొడిగించింది. రూస్ అవెన్యూ కోర్టు జారీ చేసిన సమన్లపై ఆయన హాజరయ్యారు.తీహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం కేజ్రీవాల్‌తో పాటు నిర్బంధంలో ఉన్న ఇతర నిందితులను కోర్టులో హాజరుపరిచారు.