Arvind Kejriwal: "బీజేపీ చేసిన తప్పులకు ఆర్‌ఎస్‌ఎస్ మద్దతు ఇస్తుందా".. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌కి అరవింద్ కేజ్రీవాల్ లేఖ..
ఈ వార్తాకథనం ఏంటి
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌కు ఒక లేఖ రాశారు. అందులో పలు ప్రశ్నలు సంధించారు.
కేజ్రీవాల్ తన లేఖలో బీజేపీపై కొన్ని ప్రశ్నలు కూడా అడిగారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఆప్, కాంగ్రెస్, బీజేపీ తదితర పార్టీలు ఎన్నికల సన్నాహాలలో బిజీగా ఉన్నాయి.
ఢిల్లీలో విజయం సాధించడానికి ప్రతి పార్టీ తన వంతు ప్రయత్నాలు చేస్తోంది.
ఇలాంటి సమయంలో, ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య వరుస దాడులు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో, ఓటర్ల జాబితా విషయంలో కూడా ఇద్దరు పార్టీల మధ్య తీవ్ర దాడి కొనసాగుతోంది. కేజ్రీవాల్ ఈ వివాదానికి సంబంధించి మోహన్ భగవత్ కు లేఖ రాశారు.
వివరాలు
కేజ్రీవాల్ అడిగిన ప్రశ్నలు
గతంలో బీజేపీ చేసిన తప్పులకు ఆర్‌ఎస్‌ఎస్ మద్దతు ఇస్తుందా?
దళిత, పూర్వాంచలి ఓట్లు పెద్ద ఎత్తున కోత పెడుతున్నారు దీనిపై ఆర్‌ఎస్‌ఎస్ ఏం అనుకుంటుంది? ఇది ప్రజాస్వామ్యానికి మంచిదని ఆర్‌ఎస్‌ఎస్ భావిస్తుందా?
బీజేపీ ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తోందని ఆర్‌ఎస్‌ఎస్ భావించట్లేదా?
దీనికి ముందు కూడా కేజ్రీవాల్ భగవత్‌కు ప్రశ్నలు సంధించారు. మూడు నెలల క్రితం, ఆయన మరిన్ని అంశాలపై బీజేపీని ప్రశ్నించారు. అవినీతి నేతలను పార్టీలో చేర్చడం, పార్టీ నాయకత్వాన్ని విచ్ఛిన్నం చేయడం వంటి అంశాలను ఆయన మోహన్ భగవత్‌ను ప్రశ్నించారు.
వివరాలు
అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై ఆరోపణలు
ఓటర్ల జాబితా విషయంలో అరవింద్ కేజ్రీవాల్,బీజేపీ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి.
కేజ్రీవాల్ ఢిల్లీలో బీజేపీ ఓట్లు కోస్తోందని,నిజమైన ఓటర్లను జాబితా నుంచి తొలగించేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపించారు.
అలాగే,ఆయన తన న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో డిసెంబర్ 15 నుంచి"ఆపరేషన్ కమలం" కొనసాగుతోందని చెప్పారు.
ఈ 15 రోజుల్లో దాదాపు 5000 ఓట్లను తొలగించి,7500 ఓట్లను చేర్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
బీజేపీ ప్రతీకారం:
బీజేపీ కూడా కేజ్రీవాల్‌ను టార్గెట్ చేస్తోంది.బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా మాట్లాడుతూ,2014లో ఢిల్లీలో ఓటర్ల సంఖ్య 1కోటి 19లక్షలని, 2015లో అది 1 కోటి 33 లక్షలకు పెరిగిందని చెప్పారు.
పెరిగిన 14లక్షల ఓటర్లను ఎవరూ తీసుకొచ్చారు,ఎక్కడి నుంచి వచ్చారు అనే ప్రశ్న ఆయన ఎత్తారు.