Arvind Kejriwal: కేజ్రీవాల్‌కి భారీ ఎదురుదెబ్బ: ఎర్లీ ట్రెండ్స్‌లో వెనకబడ్డ ఆప్!
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు కౌంటింగ్ కొనసాగుతోంది.
లెక్కింపు ప్రక్రియలో మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. ప్రారంభ ఫలితాల్లో భాజపా ముందంజలో కొనసాగుతుండగా, ఆప్ వెనకబడి ఉంది.
మరోవైపు, కాంగ్రెస్ ఈసారి కూడా ప్రభావం ఏ మాత్రం కనిపించడం లేదు.బీజేపీ స్థా30నాల్లో, ఆమ్ ఆద్మీ పార్టీ 24 స్థానాల్లో, కాంగ్రెస్ ఒక్క స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి.
ప్రారంభ ట్రెండ్స్‌లో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వెనకంజలో ఉండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Details
వెనుకంజలో కేజ్రీవాల్
గత రెండు దఫాలుగా దిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్, న్యూదిల్లీ అసెంబ్లీ స్థానంలో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ కంటే వెనుకబడి ఉన్నారు.
అలాగే జంగ్‌పురా నుంచి పోటీ చేస్తున్న మనీష్ సిసోడియా, కల్కాజీ నుంచి పోటీ చేసిన అతిశీ మార్లెనా కూడా వెనకంజలో ఉన్నారు.
ఈ స్థానంలో భాజపా నేత రమేష్ బిధూరి ముందంజలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా, దిల్లీ అసెంబ్లీ ఎన్నికల తుది ఫలితాలు ఏ రూపంలో మారుతాయనేది ఆసక్తిగా మారింది.