తదుపరి వార్తా కథనం
Arvind Kejriwal: ప్రజా తీర్పును గౌరవిస్తాం.. బీజేపీకి శుభాకాంక్షలు : అరవింద్ కేజ్రీవాల్
వ్రాసిన వారు
Jayachandra Akuri
Feb 08, 2025
03:23 pm
ఈ వార్తాకథనం ఏంటి
ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి అడుగుపెట్టామని, ఎన్నికల్లో ఓడినా ప్రజల వెంటే ఉంటామని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
దిల్లీ ప్రజల తీర్పును గౌరవిస్తామని, గత పదేళ్లలో ప్రజల కోసం ఎంతో సేవ చేశామని పేర్కొన్నారు. ముఖ్యంగా విద్య, వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేశామని తెలిపారు.
ఇకపై నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను బీజేపీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
విజయం సాధించిన బీజేపీ నేతలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎన్నికల్లో పోరాటం చేసిన ఆప్ నేతలు, కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.