Page Loader
Arvind Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఓటమి
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఓటమి

Arvind Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఓటమి

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 08, 2025
01:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సహా అగ్రనేతలు మనీశ్ సిసోదియా, సత్యేందర్ జైన్ పరాజయం పాలయ్యారు. ఫలితాల ధోరణిలో ఆప్ ఓటమివైపు సాగుతుండగా, కీలక నేతల ఓటమి పార్టీకి మరింత దెబ్బకొట్టింది. న్యూదిల్లీ అసెంబ్లీ స్థానంలో ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ ఓడిపోయారు. ఈ స్థానంలో భాజపా అభ్యర్థి పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ విజయం సాధించారు. జంగ్‌పుర నియోజకవర్గంలో భాజపా అభ్యర్థి తర్వీందర్ సింగ్ చేతిలో మనీశ్ సిసోదియా ఓటమిని చవిచూశారు. షాకుర్ బస్తీ అసెంబ్లీ స్థానంనుంచి సత్యేందర్ జైన్ కూడా పరాజయాన్ని మూటగట్టుకున్నారు. మూడుసార్లు గెలిచిన కేజ్రీవాల్ ను నాలుగోసారి ప్రజలు తిరస్కరించారు.