AAP: అసెంబ్లీ ఎన్నికల ముందు ఆప్‌కు గట్టి ఎదురుదెబ్బ.. మంత్రి కైలాష్ గహ్లోత్ రాజీనామా
అసెంబ్లీ ఎన్నికల ముందు ఆమ్ ఆద్మీ పార్టీకి (AAP) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాష్ గహ్లోత్ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఆయన తన రాజీనామా లేఖను ఆప్ కన్వీనర్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు పంపారు. రాజీనామా లేఖలో కైలాష్ గహ్లోత్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దిల్లీ ప్రభుత్వం ప్రజల ముందు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమైందని, ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఆప్ పై తీవ్ర విమర్శలు
ఆప్ ఆవిర్భావం ఒక నిజాయతీ గల రాజకీయ మార్గం కోసం జరిగిన గొప్ప ఉద్యమం అని, కానీ ఇప్పుడు ఆ పార్టీ నాయకుల వ్యక్తిగత రాజకీయ ఆకాంక్షలు పార్టీలో ఎక్కువయ్యాయని ఆయన ఆ లేఖలో వివరించారు. అసెంబ్లీ ఎన్నికల సమీపంలో ముందు జరిగిన ఈ పరిణామం ఆప్‌కి రాజకీయంగా దెబ్బతీయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.