Page Loader
Delhi New CM: దిల్లీ కొత్త సీఎంగా ఆతిశీ.. కేజ్రీవాల్ ప్రకటన
దిల్లీ కొత్త సీఎంగా ఆతిశీ.. కేజ్రీవాల్ ప్రకటన

Delhi New CM: దిల్లీ కొత్త సీఎంగా ఆతిశీ.. కేజ్రీవాల్ ప్రకటన

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 17, 2024
11:49 am

ఈ వార్తాకథనం ఏంటి

గత రెండు రోజులుగా నెలకొన్న సందిగ్ధానికి తెరపడింది. దిల్లీ సీఎం ఎవరో తెలిసిపోయింది. ఆ రాష్ట్ర మంత్రి ఆతిశీ తదుపరి సీఎంగా బాధ్యతలు చేపడతారని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. అప్ లెజిస్టేటివ్ మీటింగ్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇవాళ సాయంత్రం తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి లెప్టినెంట్ గవర్నర్‌కు లేఖ అందజేస్తానని కేజ్రీవాల్ వెల్లడించారు

Details

ఇవాళ రాజీనామా చేయనున్న అరవింద్ కేజ్రీవాల్

ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆదివారం కీలక ప్రకటన చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. తనపై ఉన్న ఆరోపణలు క్లియర్‌ అయ్యే వరకు ముఖ్యమంత్రి పదవిలో ఉండరని, ప్రజల నుంచి మరలా విశ్వాసం పొందేందుకు మధ్యంతర ఎన్నికలకు వెళ్ళి తన రాజకీయ భవిష్యత్తును నిర్ణయించుకుంటానని స్పష్టంచేశారు. గతవారం మాత్రమే తిహాడ్‌ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. ఇవాళ తన రాజీనామాను లెఫ్టినెంట్ గవర్నర్‌ వీకే సక్సేనాకు సమర్పించనున్నారు. ఆప్‌ వర్గాల నుండి కొత్త సీఎంగా ఆతిశీ పేరును ప్రతిపాదించారు.

Details

సెప్టెంబర్ 26 లేదా 27న ప్రమాణస్వీకారం

సెప్టెంబర్‌ 26-27 తేదీల్లో జరగనున్న దిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో ఆతిశీ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. డిప్యూటీ సీఎంగా ఎవరినీ ప్రకటించనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2024 ఫిబ్రవరిలో జరగాల్సి ఉన్నప్పటికీ, కేజ్రీవాల్‌ నవంబరులోనే మధ్యంతర ఎన్నికల కోసం డిమాండ్‌ చేస్తున్నారు. ఎన్నికల సంఘం ఈ విషయంలో ముందస్తు ఎన్నికలకు అనుకూలంగా లేకపోవచ్చని సమాచారం.