Arvind Kejriwal: సొంత కారు లేదు,ఇల్లు లేదు .. ఆస్తుల వివరాలు ప్రకటించిన కేజ్రీవాల్
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ న్యూ ఢిల్లీ నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా ఆయన తన ఆస్తుల వివరాలను వెల్లడించారు.
కేజ్రీవాల్ తనకు సొంతంగా ఇల్లు లేదా కారు లేవని పేర్కొన్నారు. అదనంగా, తాను ప్రస్తుతం 14 క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.
వివరాలు
దంపతులిద్దరి ఆస్తుల విలువను రూ.4.23 కోట్లు
అఫిడవిట్ ప్రకారం, ఆయనకు మొత్తం రూ.1.73 కోట్ల ఆస్తులు ఉన్నాయి.
ఈ సమయానికి ఆయన చేతిలో రూ.40,000 నగదు ఉండగా, ఆయన భార్య సునీత కేజ్రీవాల్ చేతిలో రూ.32,000 నగదు ఉందని వెల్లడించారు.
సునీత కేజ్రీవాల్ మొత్తం ఆస్తుల విలువను రూ.2.5 కోట్లుగా పేర్కొన్నారు.
ఇందులో రూ.25 లక్షల విలువ గల 320 గ్రాముల బంగారం, రూ.92 వేల విలువైన వెండి ఉన్నట్లు తెలిపారు.
అంతేకాకుండా, సునీత కేజ్రీవాల్‌కు గురుగ్రామ్‌లో ఇల్లు, 2017 మోడల్ మారుతి సుజుకి బెలెనో కారుతోపాటు కొన్ని ఇతర ఆస్తులు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు.
మొత్తం మీద దంపతులిద్దరి ఆస్తుల విలువను రూ.4.23 కోట్లుగా ప్రకటించారు.