 
                                                                                Arvind Kejriwal: శీష్‌మహల్ 2.0? చండీగఢ్‌లో కేజ్రీవాల్‌కు '7-నక్షత్రాల భవనం': ఫొటో షేర్ చేసిన బీజేపీ
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో చర్చనీయాంశమైన "శీష్ మహల్" పదం మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి,బీజేపీ దిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై కొత్త ఆరోపణలు చేసింది. ఆయనకు చండీగఢ్‌లో విలాసవంతమైన భవనం కేటాయించారని బీజేపీ తెలిపింది. ఆ భవనం చిత్రాలను సోషల్ మీడియాలో పంచుతూ విమర్శలు గుప్పించింది. బీజేపీ ప్రకారం.. "కామన్ మ్యాన్ అంటూ తనను ప్రచారం చేసుకున్న వ్యక్తికి సంబంధించిన మరో శీష్ మహల్ ఇదే. దిల్లీలోని భవంతి ఖాళీ చేసిన తర్వాత,పంజాబ్ సూపర్ సీఎంగా చలామణి అవుతున్న కేజ్రీవాల్ కోసం చండీగఢ్‌లో మరో అత్యంత విలాసవంతమైన గృహాన్ని సిద్ధం చేశారు.సెక్టార్-2లో రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ 7-స్టార్ స్థాయి భవనాన్ని కేజ్రీవాల్‌కు కేటాయించారు" అని పార్టీ ఆరోపించింది.
వివరాలు
దిల్లీ ఫ్లాగ్ స్టాఫ్ రోడ్‌లోని ప్రభుత్వ బంగ్లానే ఆయన అధికారిక నివాసం
బీజేపీ షేర్ చేసిన ఈ ఫొటోను మొదట ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతీ మాలీవాల్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆమె ఇటీవలి కాలంలో తన పార్టీపై విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ సీఎం గా ఉన్నప్పుడు, దిల్లీ ఫ్లాగ్ స్టాఫ్ రోడ్‌లోని ప్రభుత్వ బంగ్లానే ఆయన అధికారిక నివాసంగా ఉపయోగించారు. భాజపా ఆ భవంతినే "శీష్ మహల్" లేదా "అద్దాల మేడ"గా పేర్కొంది. రూ.45 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేసి ఆ బంగ్లాను 7-స్టార్ రిసార్ట్‌లా మార్చారని ఆరోపించింది.
వివరాలు
నాలుగు కోట్ల మందికి ఇళ్లు కట్టించాం
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా భాజపా ఈ అంశాన్ని ఆప్ పార్టీపై ప్రధాన దాడి సాధనంగా ఉపయోగించింది. నాలుగు కోట్ల మందికి ఇళ్లు కట్టించామని, కానీ.. తానేమీ అద్దాల మేడ (Sheesh mahal) కట్టుకోలేదని ప్రధాని మోదీ కూడా దుయ్యబట్టిన సంగతి తెలిసిందే. ఆప్ ప్రభుత్వంపై వచ్చిన ఈ అవినీతి ఆరోపణలు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీని దెబ్బతీశాయి. బీజేపీకు విజయాన్ని కట్టబెట్టాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
స్వాతీ మాలీవాల్ సోషల్ మీడియాలో చేసిన పోస్టు
दिल्ली का शीश महल ख़ाली होने के बाद अरविंद केजरीवाल जी ने पंजाब में दिल्ली से भी शानदार शीश महल तैयार करवा लिया है।
— Swati Maliwal (@SwatiJaiHind) October 31, 2025
चंडीगढ़ के सेक्टर 2 में CM कोटे की 2 Acre की आलीशान 7 स्टार सरकारी कोठी अरविंद केजरीवाल जी को मिल गई है।
कल अंबाला के लिए घर के सामने से सरकारी हेलीकॉप्टर में… pic.twitter.com/Vy1MfMGkt1