తదుపరి వార్తా కథనం

Kejriwal: కేజ్రీవాల్ కు ఊరట.. సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్
వ్రాసిన వారు
Stalin
Jul 12, 2024
11:28 am
ఈ వార్తాకథనం ఏంటి
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
శుక్రవారం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ ను విచారించిన సుప్రీం ధర్మాసనం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాల ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
ఈ కేసుకు సంబంధించి ఆయన 90 రోజులకు పైగా విచారణ ఎదుర్కొన్నారని చెబుతూ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
లిక్కర్ పాలసీలో మనీలాండరింగ్ ఆరోపణలతో కేజ్రీవాల్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
అయితే, కేజ్రీవాల్ పై ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది.