Page Loader
Arvind Kejriwal: సీఎం నివాసాన్ని ఖాళీ చేసిన అరవింద్ కేజ్రీవాల్‌
సీఎం నివాసాన్ని ఖాళీ చేసిన అరవింద్ కేజ్రీవాల్‌

Arvind Kejriwal: సీఎం నివాసాన్ని ఖాళీ చేసిన అరవింద్ కేజ్రీవాల్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 04, 2024
02:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు. శుక్రవారం, సివిల్ లైన్స్ ప్రాంతంలో ఉన్న 6 ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్‌ నివాసం నుంచి ఆయన తన కుటుంబంతో సహా బయటకు వెళ్లారు. ఇటీవల ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఇకపై కేజ్రీవాల్ ఆప్ పార్టీ ప్రధాన కార్యాలయానికి సమీపంలో ఉన్న బంగ్లాలో నివాసం ఉంటారు. ఈ బంగ్లా ఫిరోజ్‌షా రోడ్డులో ఉంది.ఇది పంజాబ్‌కు చెందిన ఆప్ రాజ్యసభ ఎంపీ అశోక్ మిత్తల్‌కు అధికారికంగా కేటాయించబడింది.

వివరాలు 

ఆతిషి కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు

కేజ్రీవాల్, మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న అనంతరం జైలు నుంచి విడుదలయ్యారు. ఇటీవలే ఆయన సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే, దీంతో ఆతిషి కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కేజ్రీవాల్ పార్టీ కార్యకర్తలకు తన అధికారిక నివాసాన్ని త్వరలో ఖాళీ చేస్తానని వెల్లడించారు. పలువురు చట్ట సభ్యులు, కార్యకర్తలు ఆయనను తమ ఇంటికి రావాలని, తమతో కలిసి ఉండాలని కోరారు. 2013లో తొలిసారిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు కేజ్రీవాల్ తిలక్ లేన్‌లో నివాసం ఉంటుండేవారు. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తరువాత ఆయన ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్డులోని ఇంటికి మారారు.