Page Loader
Kejriwal Resignation: సీఎం పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా
సీఎం పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా

Kejriwal Resignation: సీఎం పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 17, 2024
04:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ సీఎం పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేశారు. మంగళవారం సాయంత్రం లెప్టినెంట్ గవర్నర్ వికేసక్సేనాకు కేజ్రీవాల్ తన రాజీనామాను సమర్పించారు. రెండు రోజుల క్రితం ఆప్ పార్టీ సమావేశంలో చెప్పినట్లుగానే తన సీఎం పదవికి ఆయన రాజీనామా చేశారు. ఇప్పటికే దిల్లీ నూతన సీఎంగా మంత్రి ఆతిషి పేరును కేజ్రీవాల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీ శాసనాసభాపక్షంలోనూ ఆతిషి పేరును కొత్త సీఎంగా ఆమోదించారు.