
Rekha Gupta-Arvind Kejriwal: కేజ్రీవాల్ నా రీల్స్ చూడటం ఆపండి.. పంజాబ్ ప్రజలపై దృష్టి పెట్టండి: రేఖా గుప్తా
ఈ వార్తాకథనం ఏంటి
ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై దిల్లీ సీఎం రేఖా గుప్తా వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. తన రీల్స్ చూడటం ఆపేయాలని చురకలు అంటించారు. ఇంతకీ విషయం ఏంటంటే..? రేఖా గుప్తా మాట్లాడుతున్నట్టుగా కనిపించే ఒక వీడియోను ఆదివారం కేజ్రీవాల్ షేర్ చేశారు. అందులో ఆమె ఈవీఎంలలో అవకతవకలైనట్లు కాంగ్రెస్ చేసిన ఆరోపణలపై వ్యాఖ్యానిస్తున్నట్లుగా ఉంది. ''70 ఏళ్లపాటు కాంగ్రెస్ ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడింది,అంతకాలం ఎవరూ బాధపడలేదు. ఇప్పుడు మేము చేస్తే, వారే అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.వారు గెలిస్తే ప్రజల తీర్పు సరైనది అంటారు, మేము గెలిస్తే ఈవీఎంలు హ్యాక్ అయ్యాయని విమర్శిస్తారు. రాహుల్ గాంధీ ప్రజలను తప్పుదారిలో నడిపిస్తున్నారు'' అని ఆ క్లిప్‌ను ఎక్స్ వేదికగా కేజ్రీవాల్ పోస్టు చేశారు.
వివరాలు
పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆమ్‌ఆద్మీ పార్టీ
అదొక ఎడిటెడ్ వీడియో అనిబీజేపీ విమర్శించింది. దీనిపై తాజాగా రేఖా గుప్తా స్పందించారు. ''కేజ్రీవాల్ సర్, నా రీల్స్, ఇంటర్వ్యూలు చూడటం తగ్గించుకోవాలి. మేడమ్ ఏం చెప్పింది, ఏం చెప్పలేదో తెలుసుకోవడానికి మీరు రోజంతా నా రీల్స్ చూస్తున్నారని అనుకుంటున్నాను.నిజానికి ఆయన దృష్టి పెట్టాలనుకుంటే, వరదల కారణంగా ఇబ్బందిపడుతున్న పంజాబ్ ప్రజల గురించి ఆలోచించాలి. ఆయన బాధితులను చూసేందుకు వెళ్ళారనేది నాకు కనిపించలేదు'' అని సెటైర్‌గా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం పంజాబ్‌లో ఆమ్‌ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది.