Page Loader
EC: రాత్రి 8 కల్లా ఆధారాలు చూపించండి.. యమునాలో 'విషం' ఆరోపణలపై కేజ్రీవాల్‌కు ఈసీ ఆదేశాలు
యమునాలో 'విషం' ఆరోపణలపై కేజ్రీవాల్‌కు ఈసీ ఆదేశాలు

EC: రాత్రి 8 కల్లా ఆధారాలు చూపించండి.. యమునాలో 'విషం' ఆరోపణలపై కేజ్రీవాల్‌కు ఈసీ ఆదేశాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 29, 2025
10:49 am

ఈ వార్తాకథనం ఏంటి

హర్యానాలోని అధికార బీజేపీ యమునా నదిలో విషం కలిపేందుకు ప్రయత్నించిందని ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ చేసిన ఆరోపణలపై ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. ''తప్పుడు ఆరోపణలు చేసినట్లయితే, గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష పడవచ్చు. మీరు చేసిన ఆరోపణలకు ఆధారాలు సమర్పించండి. మీరు విషం కలిపేందుకు ప్రయత్నించినట్లయితే, ఢిల్లీ జల్ బోర్డు ఇంజనీర్ల వివరాలను కూడా అందించండి'' అని కేజ్రీవాల్‌కు ఎన్నికల సంఘం మంగళవారం లేఖ రాసింది. ఢిల్లీలోని ఆప్‌ ప్రభుత్వం హరియాణా నుంచి దిల్లీకి ప్రవహిస్తున్న యమునా నదిలో అమ్మోనియా స్థాయి అధికంగా ఉన్నట్లు ఆరోపించింది.

వివరాలు 

పొరుగు రాష్ట్రాలకు తాకిన కాలుష్య కాటు 

యమునా కాలుష్య అంశం ప్రస్తుతం ఢిల్లీ ఎన్నికల ప్రధాన అంశంగా మారింది. హరియాణా బీజేపీ ప్రభుత్వంపై పారిశ్రామిక వ్యర్థాలను యమునా నదిలో కలిపి ఢిల్లీలో విషాన్ని పంపిస్తున్నట్లు కేజ్రీవాల్‌ ఆరోపించారు. ఈ అంశాన్ని జీవజల యుద్ధం, వాటర్‌ టెర్రరిజం అంటూ హరియాణా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశాడు. ఢిల్లీ సీఎం ఆతిశీ కూడా హరియాణా నుంచి దిల్లీకి ప్రవహిస్తున్న నదీ జలాల్లో వ్యర్థాలు, అమ్మోనియా స్థాయిలో అధికంగా ఉన్నాయని విమర్శించారు. దీనిపై పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌తో కలిసి ఆమె బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. హరియాణా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఢిల్లీ ప్రజలకు నీటి సరఫరా ప్రమాదంలో పడిందని ఆరోపించారు.

వివరాలు 

హరియాణా సీఎం నయాబ్ సింగ్ షైనీ స్పందన 

మునాక్‌ కాలువ నుంచి అదనపు జలాలను విడుదలచేయాలని మాన్‌ డిమాండ్‌ చేశారు. ఈ ఆరోపణలపై హరియాణా సీఎం నయాబ్‌ సింగ్‌ షైనీ తీవ్రంగా స్పందించారు. ''కేజ్రీవాల్‌ ఆరోపణలు, ఎగువ రాష్ట్రాలతో సత్సంబంధాలను కలిగించకుండా, ఢిల్లీ ప్రజలను భయపెట్టేలా ఉంటాయి. ఈ విషయంపై లెఫ్టినెంట్‌ గవర్నర్‌ చర్యలు తీసుకోవాలి'' అని ఆయన డిమాండ్‌ చేశారు. ''ఓటమి భయంతో కేజ్రీవాల్‌ నిస్సహాయంగా మారిపోయారు. ఢిల్లీ ప్రజలను భయపెట్టి ఓట్ల లబ్ధి పొందేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు'' అని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా ఆరోపించారు. బీజేపీ, ఆప్‌ పార్టీలు తమ మేనిఫెస్టోల్లో యమునా కాలుష్యాన్ని అరికట్టడం, పునరుజ్జీవం చేయడం గురించి హామీలు ఇచ్చాయి. ఈ అంశం ఇప్పుడు ఎన్నికల హామీలలో ప్రధానమైనదిగా మారింది.