AAP: ఆప్‌కు షాక్.. కేజ్రీవాల్ సహా కీలక నేతలంతా వెనకంజలో!
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సంచలనంగా మారాయి. దశాబ్దం పాటు దిల్లీని పాలించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.
శనివారం ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచే బీజేపీ స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోంది.
తాజా సమాచారం ప్రకారం, బీజేపీ 50 స్థానాల్లో ముందంజలో ఉండగా, ఆప్ 19 స్థానాల్లో, కాంగ్రెస్ ఒక్క స్థానంలో మాత్రమే ఆధిక్యంలో ఉంది.
Details
వెనుకంజలో కేజ్రీవాల్
ఎన్నికల ఫలితాల్లో మరో కీలక అంశం ఏమిటంటే, ఆప్ నేత, దిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ న్యూదిల్లీ స్థానం నుంచి వెనకబడ్డారు.
ఈ స్థానంలో బీజేపీ కీలక నేత పర్వేష్ వర్మ ముందంజలో ఉన్నారు. కేజ్రీవాల్‌తో పాటు, ప్రస్తుత సీఎం అతిశీ మార్లెనా కల్కాజీ నియోజకవర్గంలో వెనుకంజలో ఉన్నారు.
అక్కడ బీజేపీ అభ్యర్థి రమేశ్ బిధూరి గెలుపు దిశగా సాగుతున్నారు.
Details
ఆప్ కీలక నేతలు వెనుకంజలో
మరో కీలక నేత మనీష్ సిసోడియా జంగ్‌పురా నుంచి పోటీ చేసినా, బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
ఆప్ నేతలకు ఎదురైన ఈ చేదు అనుభవం పార్టీ భవిష్యత్తుపై ప్రశ్నార్థకాన్ని నెలకొల్పుతోంది.
ఆప్ విశ్వసనీయతను దెబ్బతీసిన ప్రధాన అంశాల్లో దిల్లీ లిక్కర్ కుంభకోణం ఒకటి. ఈ స్కాంలో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాల పేర్లు నిందితులుగా ఉండటం గమనార్హం.
అవినీతికి వ్యతిరేకంగా పోరాడతామని చెబుతూ రాజకీయాల్లోకి వచ్చిన ఆప్, అవినీతి ఆరోపణల్లో ఇరుక్కోవడం దిల్లీ ఓటర్ల నమ్మకాన్ని దెబ్బతీసింది. ఈ ప్రభావమే తాజా ఫలితాల్లో తీవ్ర ప్రభావం చూపినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.