Arvind Kejriwal: నితిన్ గడ్కరీ పనితీరుపై ప్రశంసలు కురిపించిన అరవింద్ కేజ్రీవాల్
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీపై ప్రశంసలు కురిపించారు.
ఒక వైపు కేజ్రీవాల్ నితిన్ గడ్కరీను మెచ్చుకుంటూ, మరోవైపు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను స్వచ్ఛమైన సిద్ధాంతాలతో కూడిన నాయకుడిగా అభివర్ణించారు.
కాంగ్రెస్, బీజేపీలను తరచూ అవినీతి ఆరోపణలతో విమర్శించే కేజ్రీవాల్ ఇతర పార్టీల నేతలను ప్రశంసించడం అరుదైన విషయమని చెప్పొచ్చు.
దిల్లీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేజ్రీవాల్ పలు కీలక అంశాలపై స్పందించారు.
బీజేపీకి చెందిన ఏ నాయకుడు బాగా పని చేస్తారని మీరు అనుకుంటారు?" అనే ప్రశ్నకు కేజ్రీవాల్ సమాధానమిచ్చారు. తనకు నితిన్ గడ్కరీ అంటే ఇష్టమని చెప్పారు.
Details
దేశంలో ఎన్నో మంచి పనులు చేశారు
దేశంలో ఎన్నో మంచి పనులు చేశారని కొనియాడారు. నితిన్ గడ్కరీ మోడీ కేబినెట్‌లో రోడ్డు, రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు.
ఆయన హైవే నిర్మాణంలో చేసిన సేవలకు 'హైవే మ్యాన్' అనే పేరు కూడా వచ్చిందన్నారు. విపక్ష నేతలు సైతం గడ్కరీ పనితీరును ప్రశంసించగా, ఇప్పుడు ఆప్ అధినేత కూడా ఆయనను మెచ్చుకున్నారు.
ఫిబ్రవరిలో జరగనున్న దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఆప్, బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య త్రిముఖ పోరుగా మారనున్నాయి.
2013 డిసెంబర్‌లో తొలిసారి ముఖ్యమంత్రి అయిన కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీకి వరుస విజయాలను అందించారు.
అయితే ఈ ఎన్నికలు ఆమ్ ఆద్మీ పార్టీకి కఠినంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.