
Arvind Kejriwal: నరేంద్ర మోదీ నాపై కుట్ర చేసి నా ప్రతిష్టను దెబ్బతీయాలనుకున్నాడు : కేజ్రీవాల్
ఈ వార్తాకథనం ఏంటి
ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు.
ఆదివారం జంతర్‌మంతర్‌లో జరిగిన 'జంతాకీ అదాలత్' కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.
ప్రధాని మోదీ తనను అవినీతిపరుడిగా నిరూపించేందుకు కుట్ర పన్నారని, తమ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నించారని చెప్పారు.
తాను డబ్బు సంపాదించడానికి రాజకీయాల్లోకి రాలేదని, దేశ రాజకీయాలను మార్చేందుకు వచ్చానని ఈ సందర్భంగా కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
Details
ఆర్ఎస్ఎస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు
అనంతరం ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీపై నాయకులపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
తాము జాతీయవాదులు, దేశభక్తులమని ఆర్‌ఎస్‌ఎస్ వాళ్లు చెబుతుంటారని, అయితే తాను మోహన్ భగవత్ ని ఐదు ప్రశ్నలు అడగాలనుకుంటున్నాని చెప్పారు.
మోదీ తప్పుడు పనులు చేయకుండా మీరు ఎప్పుడైనా ఆపారంటూ ప్రశ్నించారు.
75 సంవత్సరాల తర్వాత నేతలు రిటైర్ అవుతారని వాళ్లు చట్టం చేశారని, అయితే ఆ నియమం మోదీకి వర్తించదా అని తెలిపారు.