
Arvind Kejriwal : లిక్కర్ స్కామ్‌లో కేజ్రీవాల్‌ను విచారించేందుకు ఎల్జీ అనుమతి
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ షాక్ తగిలింది.
లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్‌ను ప్రాసిక్యూట్ చేయడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతినిచ్చినట్లు సమాచారం అందింది.
ఈ పరిణామంతో లిక్కర్ స్కామ్, మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌పై ప్రత్యేక కోర్టు విచారణకు లైన్ క్లియర్ అవుతుందని అంచనా వేస్తున్నారు.
సీఆర్పీసీ ప్రకారం పబ్లిక్ సర్వెంట్‌లను విచారించేందుకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా అవసరం. అయితే ఈడీ కేసుల్లో గతంలో ఈ అనుమతి అవసరం లేకపోయింది.
Details
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు
తాజాగా సుప్రీంకోర్టు నవంబర్ 6వ తేదీగా ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈడీ కేసుల్లో కూడా పబ్లిక్ సర్వెంట్‌లను విచారించేందుకు ప్రభుత్వ అనుమతి అవసరమైంది.
దీంతో ఈడీ కేజ్రీవాల్‌ను విచారించేందుకు ఎల్జీ అనుమతి కోరింది.
ఈ క్రమంలో లిక్కర్ కేసులో అరెస్టైన కేజ్రీవాల్, సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో తాహీర్ జైలులో నుంచి విడుదలయ్యారు.
ఆయన విడుదలైన తర్వాత తన సీఎం పదవికి రాజీనామా చేశారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, కేజ్రీవాల్ ఆ ఎన్నికలపై ఫోకస్ పెట్టి, ఆప్ అభ్యర్థుల జాబితాను ఇప్పటికే ప్రకటించారు.