Liquor Policy of Delhi: దిల్లీ మద్యం పాలసీ.. కాగ్ నివేదికలో 2,026 కోట్ల నష్టం
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీ లిక్కర్ పాలసీ వివాదం గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తాజాగా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక వెలుగులోకి రావడం ఈ వ్యవహారానికి మరింత ఊతమిచ్చింది.
నివేదికలో దిల్లీ ప్రభుత్వానికి రూ. 2,026 కోట్ల నష్టం జరిగినట్లు తెలిపింది. ఈ లిక్కర్ పాలసీని సరిగ్గా అమలు చేయడంలో ఆమ్ ఆద్మీ పార్టీ విఫలమైందని కాగ్ నిర్ధారించింది.
కాగ్ నివేదిక ప్రకారం, మద్యం విధానానికి సంబంధించి నిర్ణయాలు తీసుకునే సమయంలో మంత్రివర్గం, లెఫ్టినెంట్ గవర్నర్ నుండి ఆమోదం తీసుకోకపోవడం, నిపుణుల కమిటీ సూచనలను పట్టించుకోకపోవడం, లైసెన్సుల జారీ, రూల్స్ ఉల్లంఘనలు జరిగినట్లు వెల్లడైంది.
Details
దిల్లీలో ఫిబ్రవరి 5న అసెంబ్లీ ఎన్నికలు
నివేదికలో బిడ్డింగ్ ప్రక్రియ గురించి కూడా వివరాలిచ్చింది. బిడ్డింగ్ చేసిన కంపెనీల ఆర్థిక పరిస్థితిపై ఎలాంటి పరిశీలనలు లేకుండా, నష్టాల్లో ఉన్న సంస్థలకు కూడా లైసెన్సులు పునరుద్ధరించారని పేర్కొంది.
ఈ లిక్కర్ పాలసీ కేసులో దిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను ఈడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత వీరు బెయిల్‌పై విడుదలయ్యారు. కాగా దిల్లీలో ఫిబ్రవరి 5న అసెంబ్లీ ఎన్నికలు, 8న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
ఎన్నికల సమయానికి లిక్కర్ పాలసీకి సంబంధించి కాగ్ నివేదిక వెలువడడం ప్రముఖ చర్చా అంశంగా మారింది.