Page Loader
Viral video: ఘనంగా కేజ్రీవాల్ కుమార్తె వివాహం.. 'పుష్ప2' పాటకు స్టెప్పులేసిన మాజీ సీఎం
కేజ్రీవాల్ కుమార్తె వివాహం.. 'పుష్ప2' పాటకు స్టెప్పులేసిన మాజీ సీఎం

Viral video: ఘనంగా కేజ్రీవాల్ కుమార్తె వివాహం.. 'పుష్ప2' పాటకు స్టెప్పులేసిన మాజీ సీఎం

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 19, 2025
09:14 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌,దిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన కుమార్తె హర్షిత వివాహం ఆమె స్నేహితుడు సంభవ్‌ జైన్‌తో శుక్రవారం రాత్రి ఘనంగా జరిగింది. ఈవేడుక దిల్లీలోని కపుర్తలా హౌస్‌లో జరగగా, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌,దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సహా ఆప్ పార్టీకి చెందిన ప్రముఖ నాయకులు, కుటుంబసభ్యులు పాల్గొన్నారు. వివాహవేడుక సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్‌ తన భార్య సునీతా కేజ్రీవాల్‌తో కలిసి చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. 'పుష్ప 2'సినిమాలోని 'సూసేకీ'అనే పాటకు హిందీ వెర్షన్‌లో స్టెప్పులేశారు.కేజ్రీవాల్‌తో పాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌ కూడా డ్యాన్స్ చేస్తూ సందడిని మ‌రింత పెంచారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

'పుష్ప2' పాటకు స్టెప్పులేసిన మాజీ సీఎం