Page Loader
PM Modi: ఆమ్‌ఆద్మీపార్టీపై ధ్వమజమెత్తిన మోదీ.. ప్రధాని తాగే నీళ్లలో విషం కలుపుతారా?
ఆమ్‌ఆద్మీపార్టీపై ధ్వమజమెత్తిన మోదీ.. ప్రధాని తాగే నీళ్లలో విషం కలుపుతారా?

PM Modi: ఆమ్‌ఆద్మీపార్టీపై ధ్వమజమెత్తిన మోదీ.. ప్రధాని తాగే నీళ్లలో విషం కలుపుతారా?

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 29, 2025
03:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

యమునా నదిని ఉద్దేశపూర్వకంగా హర్యానా విషపూరితం చేస్తోందంటూ ఆప్‌ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దిల్లీ ఎన్నికల సమయాల్లో ఈ వ్యాఖ్యలు ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP),హరియాణాలోని బీజేపీ ప్రభుత్వానికి మధ్య వివాదానికి దారితీశాయి. ఈ నేపథ్యంలో, దేశ రాజధానిలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఆప్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

వివరాలు 

హరియాణా, దిల్లీలో నివసించే ప్రజలు ఒకటే కదా?

''ప్రధాని తాగే నీటిలో హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం విషం కలుపుతుందా?'' అంటూ మోదీ ప్రశ్నించారు. ''దిల్లీ మాజీ ముఖ్యమంత్రి హర్యానా ప్రజలపై అసహ్యకరమైన ఆరోపణలు చేశారు. ఓటమి భయంతో ఆప్‌ నేతలు గందరగోళానికి గురవుతున్నారు. హరియాణా, దిల్లీలో నివసించే ప్రజలు ఒకటే కదా? హరియాణా ప్రజల బంధువులు దేశ రాజధానిలో లేరా? తమ సొంత ప్రజలు తాగే నీటిని విషపూరితం చేస్తారా? హరియాణా పంపించే నీటిని దిల్లీలో ప్రతిఒక్కరు వినియోగిస్తున్నారు. అందులో నేను (ప్రధాని మోదీ) కూడా ఉన్నాను'' అని మోదీ కేజ్రీవాల్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

వివరాలు 

25 సంవత్సరాల భవిష్యత్తు ప్రణాళికను అమలు చేయాలి

అలాగే, దిల్లీలో కాంగ్రెస్, ఆప్‌ పాలనపై విమర్శలు చేస్తూ, ''ఈ రెండు పార్టీలు 25 సంవత్సరాలుగా దిల్లీని పాలించాయి. కానీ ప్రజల సమస్యలు అలాగే ఉన్నాయి. ట్రాఫిక్‌ జామ్‌లు, నీటి నిల్వ సమస్య, కాలుష్యం - ఇవన్నీ ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నాయి. మీ ఓటు మాత్రమే వీటి నుంచి విముక్తి కలిగించగలదు. గత 11 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తిచేయాలి. 25 సంవత్సరాల భవిష్యత్తు ప్రణాళికను అమలు చేయాలి. 25 సంవత్సరాలు ఆ రెండు పార్టీల పాలన చూశారు. ఇప్పుడు కమలానికి ఒక అవకాశం ఇవ్వండి'' అని మోదీ ఓటర్లను కోరారు.