Page Loader
AAP : ఆప్‌ తుది జాబితా విడుదల.. కేజ్రీవాల్‌, ఆతిశీ పోటీ ఎక్కడినుంచంటే? 
ఆప్‌ తుది జాబితా విడుదల.. కేజ్రీవాల్‌, ఆతిశీ పోటీ ఎక్కడినుంచంటే?

AAP : ఆప్‌ తుది జాబితా విడుదల.. కేజ్రీవాల్‌, ఆతిశీ పోటీ ఎక్కడినుంచంటే? 

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 15, 2024
03:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధాని దిల్లీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేసింది. మొత్తం 70 స్థానాలున్న దిల్లీ అసెంబ్లీకి ఆప్ ఇప్పటికే మూడు జాబితాలను ప్రకటించగా, తాజాగా 38 మంది అభ్యర్థులతో పూర్తిస్థాయి జాబితాను ప్రకటించింది. ఆప్‌ అధినేత, మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ న్యూదిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. మరోసారి కాల్కాజీ నుంచి ఆతిశీ బరిలోకి దిగుతుండగా, గ్రేటర్‌ కైలాష్‌ నుంచి సౌరభ్‌ భరద్వాజ్‌, బాబర్‌పుర్‌ నుంచి గోపాల్‌రాయ్‌, ఓఖ్లా నుంచి అమానతుల్లా ఖాన్‌ పోటీ చేస్తున్నారు. షాకుర్‌బస్తీ నుంచి సత్యేందర్‌కుమార్‌ జైన్‌ కూడా మరోసారి బరిలోకి దిగనున్నారు.

Details

20 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేకు నో టికెట్

ఈ ఎన్నికల్లో 20 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు ఆప్ టికెట్లు ఇవ్వలేదు. కస్తూర్బానగర్‌ ఎమ్మెల్యే మదన్‌లాల్‌ స్థానంలో రమేశ్‌ పెహల్వాన్‌ను అభ్యర్థిగా నిలబెట్టింది. న్యూదిల్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరపున దివంగత సీఎం షీలా దీక్షిత్ కుమారుడు సందీప్‌ దీక్షిత్‌ పోటీ చేయనుండటంతో కేజ్రీవాల్‌కు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. తమ అభ్యర్థుల్ని ప్రకటించిన సందర్భంగా కేజ్రీవాల్‌ బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీకి దిల్లీపై ఎలాంటి స్పష్టమైన విజన్‌ లేదని, వారి ఏకైక లక్ష్యం కేజ్రీవాల్‌ను తొలగించడమేనని చెప్పారు. దిల్లీ ప్రజలు పని చేసిన వారికి మాత్రమే ఓటు వేస్తారని, విమర్శలు చేసే వారికి కాదని ఆయన వ్యాఖ్యానించారు.