
Arvind Kejrival: అరవింద్ కేజ్రీవాల్ కి బిగ్ షాక్.. బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
ఈ వార్తాకథనం ఏంటి
అరవింద్ కేజ్రీవాల్ కి సుప్రీంకోర్టులో మరో షాక్ తగిలింది. సీబీఐ అరెస్టు వ్యవహారంలో మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
దీంతో తదుపరి విచారణను ఆగస్టు 23కి వాయిదా వేసింది.
అదే విధంగా సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సీబీఐ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఇక సీబీఐ అరెస్టుపై దిల్లీ హైకోర్టు సమర్థించడాన్ని సవాల్ చేస్తూ మరో పిటషన్ కూడా దాఖలు చేశారు. ఈ పిటిషన్ ఆధారంగా సుప్రీంకోర్టు సీబీఐకి నోటీసులిచ్చింది.
ప్రస్తుతానికి బెయిల్ ఇవ్వలేమని, నోటీసులు మాత్రం ఇవ్వగలమని ధర్మాసనం స్పష్టం చేసింది.
Details
క్రేజివాల్ అరెస్టు అనైతికం కాదన్న హైకోర్టు
లిక్కర్ స్కాం కేసులో దిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు ఇటీవలే సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఆ తర్వాత రెండు రోజులకే కేజ్రీవాల్ కూడా పిటిషన్ దాఖలు చేయడం విశేషం.
సీబీఐ, ఈడీ విచారణను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేస్తూ, బెయిల్ కావాలని కోరారు.
గతంలో దిల్లీ హైకోర్టు కూడా ఇదే వ్యవహారంపై విచారణ జరపగా, క్రేజివాల్ అరెస్టు అనైతికం కాదని తేల్చి చెప్పింది.
పక్కా సాక్ష్యాధారాలున్నప్పుడు అక్రమం ఎలా అవుతుందని ప్రశ్నించింది. దీంతో క్రేజీవాల్ సుప్రీంకోర్టును అశ్రయించారు.