హైకోర్టు: వార్తలు

17 Mar 2023

తెలంగాణ

వివేకా హత్య కేసు: 'అరెస్టు విషయంలో జోక్యం చేసుకోలేం'; అవినాష్ రెడ్డికి తేల్చి‌చెప్పిన హైకోర్టు

వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తునకు సంబంధించి కడప ఎంపీ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. అంతేకాకుండా విచారణకు సహకరించాలని ఆదేశించింది.

09 Mar 2023

దిల్లీ

దిల్లీ మెట్రో- అరవింద్ టెక్నో మధ్య వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిగా జస్టిస్ ఎన్‌వీ రమణ నియామకం

దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ), అరవింద్ టెక్నో గ్లోబ్ జేవీ మధ్య తలెత్తిన వివాదాలను పరిష్కరించేందుకు భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణను దిల్లీ హైకోర్టు మధ్యవర్తిగా నియమించింది.

27 Feb 2023

దిల్లీ

అగ్నిపథ్ పథకాన్ని సమర్థించిన దిల్లీ హైకోర్టు; ఆ పిటిషన్లన్నీ కొట్టివేత

అగ్నిపథ్ పథకాన్ని దిల్లీ హైకోర్టు సమర్థిస్తూ నిర్ణయం తీసుకుంది. అగ్నిపథ్ పథకం రాజ్యాంగ సవరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ, న్యాయమూర్తి సుబ్రమణియం ప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది.

హిజాబ్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన కర్ణాటక విద్యార్థినులు; బెంచ్ ఏర్పాటుకు సీజేఐ హామీ

హిజాబ్ ధరించి పరీక్షలకు హాజరు కావడానికి అనుమతించాలని, తమ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని కోరుతూ కర్ణాటకకు చెందిన విద్యార్థినుల బృందం బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

అసోం: బాల్య వివాహాల కేసుల్లో 'పోక్సో'ను ఎందుకు ప్రయోగిస్తున్నారు?: గువాహటి హైకోర్టు ప్రశ్న

బాల్య వివాహాలను అదుపు చేయడంలో అసోం ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై గువాహటి హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. బాల్య వివాహాల కేసుల్లో 'పోక్సో' చట్టాన్ని ఎందుకు ప్రయోగిస్తున్నారని ప్రశ్నించింది.

యూపీ: అక్రమ ఆయుధాల నివారణకు తీసుకుంటున్న చర్యలేంటి? రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు

లైసెన్సు లేని తుపాకుల వల్ల కలిగే అనార్థాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

మద్రాస్ హైకోర్టు జడ్టిగా గౌరీ ప్రమాణం, ఆమెకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను కొట్టేసిన సుప్రీంకోర్టు

మద్రాసు హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా ప్రముఖ మహిళా న్యాయవాది లక్ష్మణ చంద్ర విక్టోరియా గౌరీ నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను మంగళవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది.

ముస్లిం మహిళలు విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాలి: మద్రాసు హైకోర్టు

ముస్లిం మహిళలు 'ఖులా' ద్వారా విడాకులు పొందాలనుకుంటే ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాలని, షరియత్ కౌన్సిల్ వంటి సంస్థల వద్దకు వెళ్లొద్దని మద్రాసు హైకోర్టు పేర్కొంది. వివాహాలను రద్దు చేసే అధికారం ప్రైవేట్ సంస్థలు లేదని తేల్చి చెప్పింది.

డోలో-650 తయారీదారుపై ఈఎస్ఐ కుంభకోణం ఆరోపణ, అలహాబాద్ హైకోర్టులో పిటిషన్

డోలో-650 ట్యాబ్లెట్లను తయారు చేస్తున్న ఫార్మాస్యూటికల్ కంపెనీకి వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ (ఈఎస్ఐ) కుంభకోణానికి కంపెనీ పాల్పడినట్లు ఆరోపిస్తూ, ట్రయల్ కోర్టులో వ్యాజ్యం దాఖలైంది.

సుప్రీంకోర్టు ఆదేశాలు: జీఓ నెం.1 పిటిషన్‌పై 23న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ

ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ షోలు, ర్యాలీల నిర్వహణను నిషేధిస్తూ.. ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నెం.1 పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ఉన్నందున విచారణను వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. జీఓ నంబర్ 1పై జనవరి 23న విచారణ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆదేశించింది.

20 Jan 2023

బ్యాంక్

ఐసీఐసీఐ-వీడియోకాన్ రుణం కేసు: వేణుగోపాల్ ధూత్‌కు బెయిల్ మంజూరు

ఐసీఐసీఐ బ్యాంక్ - వీడియోకాన్ రుణం కేసులో బాంబే హైకోర్టు వీడియోకాన్ గ్రూప్ ఛైర్మన్ వేణుగోపాల్ ధూత్‌కు బెయిల్ మంజూరు చేసింది.

జీఓ నెం.1ను సస్పెండ్ చేసిన ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు

ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ షోలు, ర్యాలీల నిర్వహణను నిషేధిస్తూ.. ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నెం.1ను హైకోర్టు సస్పెండ్ చేసింది. ప్రభుత్వం నిర్ణయం నిబంధనలకు విరుద్ధంగా ఉందని ఈ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది. దీనిపై రాష్ట్రం ప్రభుత్వం జనవరి 20లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

12 Jan 2023

కర్ణాటక

సద్గురుకు కర్ణాటక హైకోర్టు షాక్, ఈశా యోగా కేంద్రం ప్రారంభోత్సవం నిలిపివేత

ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీవాసుదేవ్‌కు కర్ణాటక హైకోర్టులో చుక్కెదురైంది. బెంగళూరు సమీపంలోని నంది కొండల దిగువన ఆదియోగి విగ్రహావిష్కరణతో పాటు ఈశా యోగా కేంద్రం ప్రారంభోత్సవంపై స్టే విధించింది.

10 Jan 2023

తెలంగాణ

తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్‌కు హైకోర్టులో చుక్కెదురు.. క్యాడర్ కేటాయింపు రద్దు

తెలంగాణ సీఎస్‌గా పని చేస్తున్న సోమేష్ కుమార్‌ క్యాడర్ కేటాయింపుపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. సోమేష్‌కుమార్‌ కేడర్‌ను రద్దు చేసింది. ఏపీ క్యాడర్‌కు సోమేష్‌కుమార్‌ వెళ్లాల్సిందేనని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ‌ సందర్భంగా కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.

సలహాదారుల నియామకాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

వివిధ శాఖలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సలహాదారులను నియమించడంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం సలహాదారులను నియమించే అధికారం ఉందా? లేదా? అనే దానిపై లోతుగా విచారణ జరపాల్సి ఉందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా నేతృత్వంలోని డివిజన్‌ ​​బెంచ్‌ పేర్కొంది.

అసైన్డ్ భూముల్లో గ్రానైట్ తవ్వకాలపై హైకోర్టులో విచారణ.. మంత్రి రజనీకి నోటీసు

ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజనీకి హైకోర్టు షాక్ ఇచ్చింది. అసైన్డ్ భూములను గ్రానైట్ తవ్వకాలకు అనుమతులు ఇచ్చిన కేసులో నోటీసు జారీ చేసింది. మంత్రి విడదల రజనీకి కౌంటర్ దాఖలు చేయవలసిందిగా ఈ సందర్భంగా ధర్మాసనం కోరింది.