Page Loader
Dilsukhnagar Bomb Blast:దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల కేసులో హైకోర్టు సంచలన తీర్పు .. ఐదుగురు నిందితులకు ఉరిశిక్ష
దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల కేసులో హైకోర్టు సంచలన తీర్పు .. ఐదుగురు నిందితులకు ఉరిశిక్ష

Dilsukhnagar Bomb Blast:దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల కేసులో హైకోర్టు సంచలన తీర్పు .. ఐదుగురు నిందితులకు ఉరిశిక్ష

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 08, 2025
10:52 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్,దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన బాంబు దాడుల కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఈ కేసులో NIA ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది.ఐదుగురు నిందితులకు విధించిన ఉరిశిక్ష సరైనదేనని పేర్కొంటూ సంచలన తీర్పు ఇచ్చింది. 2013లో దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన ఈ ద్వంద్వ బాంబు దాడుల్లో 18 మంది ప్రాణాలు కోల్పోయారు,మరో 130 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన నగర వాసుల్లో తీవ్రమైన భయాన్ని కలిగించింది. ఈ కేసును విచారించిన NIA ఫాస్ట్‌ట్రాక్ కోర్టు, 2016లో యాసిన్‌ భత్కల్‌తో పాటు ఐదుగురికి ఉరిశిక్షను విధించింది.

వివరాలు 

హైకోర్టును ఆశ్రయించిన నిందితులు

అయితే, ఈ తీర్పుపై నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఘటనకు ప్రధాన సూత్రధారి యాసిన్‌ భత్కల్‌గా పోలీసులు పేర్కొన్నారు. అతడిపై కేసు నమోదు చేసి, లోతుగా విచారణ చేపట్టారు. అయితే, మరో ప్రధాన నిందితుడు రియాజ్‌ భత్కల్‌ ఇప్పటికీ పరారీలో ఉన్నాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జంట పేలుళ్ల కేసు.. హైకోర్టు సంచలన తీర్పు