Live in Relationships: సహజీవనానికి గ్రీన్ సిగ్నల్.. జంటలకు రక్షణ ఇవ్వాలన్న హైకోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలో వివాహ బంధానికి ప్రత్యేక స్థానం ఉంది. సాంప్రదాయాలు, సంస్కృతి కారణంగా వివాహేతర సంబంధాలను సమాజం అంగీకరించకపోవడం సాధారణం. ఇటీవల వివాహేతర సంబంధాల కారణంగా ఎదురవుతున్న ఘోర ఘటనలు, పడక సుఖం కోసం ఏర్పడే ఘర్షణలు సామాజిక సమస్యగా మారాయి. ఇలాంటి సందర్భంలో అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. జస్టిస్ వివేక్ కుమార్ సింగ్ సింగిల్ బెంచ్, లివింగ్ రిలేషన్‌షిప్ తప్పు కాదని స్పష్టం చేస్తూ, మహిళల ప్రశాంత జీవనానికి భంగం కలిగించకూడదని, జంటలకు రక్షణ కల్పించాల్సిందని పోలీసులకు సూచించారు. సహజీవనం చేస్తున్న 12 జంటలు రక్షణ కోసం కోర్టును ఆశ్రయించాయి. విచారణలో, హైకోర్టు లివింగ్ రిలేషన్‌షిప్ చట్టవిరుద్ధం కాదని స్పష్టంచేసింది.
Details
మ్యారేజ్ సర్టిఫికెట్ లేనప్పటికీ కలిసి జీవించడం తప్పు కాదు
వివాహం కాకపోవడం నేరం కాదని, మ్యారేజ్ సర్టిఫికెట్ లేనప్పటికీ కలిసి జీవించడం చట్టపరంగా తప్పు కాదని తీర్పులో పేర్కొన్నది. హైకోర్టు 12 మహిళలకు రక్షణ కల్పించమని, మహిళల ప్రశాంత జీవితంలో ఎవరైనా భంగం కలిగిస్తే వారిపై పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీసులు చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఈ తీర్పు అందరికీ ఆమోదయోగ్యం కాకపోవచ్చని కూడా సూచించింది. మైన్‍ర్ లేదా మేజర్, వివాహిత లేదా అవివాహిత తేడా లేకుండా జీవించే హక్కు ఉంది. ఇది భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కు. విద్యావంతులైన మహిళలు తమ ఇష్టానుసారం జీవించాలనుకుంటే, పోలీసులు వారికి రక్షణ కల్పించాలని జస్టిస్ సింగ్ తీర్పులో చెప్పారు.