LOADING...
Supreme Court: ఏపీ హైకోర్టులోకి మరోసారి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ ప్రవేశం.. కొలీజియం కీలక సిఫారసు
ఏపీ హైకోర్టులోకి మరోసారి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ ప్రవేశం.. కొలీజియం కీలక సిఫారసు

Supreme Court: ఏపీ హైకోర్టులోకి మరోసారి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ ప్రవేశం.. కొలీజియం కీలక సిఫారసు

వ్రాసిన వారు Jayachandra Akuri
May 28, 2025
12:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

సుప్రీంకోర్టు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని తొలిసభలో, పది రాష్ట్రాల హైకోర్టులకు చెందిన 21 మంది న్యాయమూర్తుల బదిలీకి సిఫారసు చేయాలని కొలీజియం నిర్ణయించింది. ఇందులో ఇప్పటికే మద్రాస్ హైకోర్టులో సేవలందిస్తున్న జస్టిస్ బట్టు దేవానంద్‌ను తిరిగి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేయాలని ప్రతిపాదించింది.

Details

 జస్టిస్ బట్టు దేవానంద్ - మళ్లీ ఏపీ హైకోర్టుకు

జస్టిస్ బట్టు దేవానంద్ 2020 జనవరి 13న ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. అనంతరం 2023 ఏప్రిల్ 10న మద్రాస్ హైకోర్టుకు బదిలీపై వెళ్లిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన్ని మళ్లీ ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని కొలీజియం సూచించింది. ఆయన 1966 ఏప్రిల్ 14న గుడివాడలో జన్మించారు. ఆంధ్రా యూనివర్సిటీ లా కాలేజీ నుంచి ఆయన బీఎల్ డిగ్రీ నుంచి డిగ్రీ పొందాడు. 1989 జులై 6న బార్ కౌన్సిల్‌లో నమోదయ్యారు. తన న్యాయవాద జీవనాన్ని విశాఖపట్నం జిల్లా కోర్టులో ప్రారంభించారు.

Details

 జస్టిస్ సుజయ్‌పాల్ - కోల్‌కతా హైకోర్టుకు బదిలీ

ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సుజయ్‌పాల్‌ను కోల్‌కతా హైకోర్టుకు బదిలీ అయ్యారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆయన 2024 మార్చి 26న తెలంగాణ హైకోర్టుకు బదిలీపై వచ్చిన విషయం తెలిసిందే. 2025 జనవరి 21 నుంచి తాత్కాలిక సీజేగా విధులు చేపడుతున్నారు. జస్టిస్ అలోక్ ఆరాధే బాంబే హైకోర్టుకు బదిలీ అయిన తర్వాత ఈ బాధ్యత తీసుకున్నారు.

Advertisement

Details

 జస్టిస్ అన్నిరెడ్డి అభిషేక్‌రెడ్డి - తెలంగాణ హైకోర్టుకు

రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లింగంపల్లిలో అభిషేక్ రెడ్డి జన్మించారు. 2019 ఆగస్టు 26న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం 2023 మే 15నపట్నా హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఇప్పుడు మళ్లీ తెలంగాణ హైకోర్టుకు బదిలీపై వస్తున్నారు. ఆయనకు సివిల్, క్రిమినల్, రాజ్యాంగ న్యాయాలలో విశేష అనుభవం ఉంది. జస్టిస్ కన్నెగంటి లలిత - మళ్లీ తెలంగాణ హైకోర్టుకే బాపట్ల జిల్లాకు చెందిన జస్టిస్ లలిత 2020 మే 2న ఏపీ హైకోర్టులో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తర్వాత 2021 నవంబరు 15న తెలంగాణ హైకోర్టుకు, అనంతరం 2023 జులై 28న కర్ణాటక హైకోర్టుకు బదిలీపై వెళ్లారు. ఇప్పుడు ఆమెను తిరిగి తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని కొలీజియం నిర్ణయించింది.

Advertisement

Details

జస్టిస్ చిల్లకూరు సుమలత - కర్ణాటక నుంచి తిరిగి తెలంగాణ హైకోర్టుకు 

నెల్లూరులో జన్మించిన జస్టిస్ సుమలత 2007లో జిల్లా జడ్జిగా ఎంపికై రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో సేవలందించారు. 2021 అక్టోబరు 14న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2023 నవంబరు 23న కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు. తాజాగా మళ్లీ తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేస్తూ కొలీజియం సిఫారసు చేసింది. ఈ బదిలీలు త్వరలో అధికారికంగా అమలులోకి రానున్నాయి. ప్రతి న్యాయమూర్తి తన స్వంత రాష్ట్రానికి లేదా తిరిగి పనిచేసిన హైకోర్టుకే చేరుతున్న తీరు విశేషంగా నిలిచింది.

Advertisement