LOADING...
Kamal Haasan: ప్రజల మనోభావాలు దెబ్బతీయకూడదు.. కమల్‌ హాసన్‌ను ప్రశ్నించిన కర్ణాటక హైకోర్టు!
ప్రజల మనోభావాలు దెబ్బతీయకూడదు.. కమల్‌ హాసన్‌ను ప్రశ్నించిన కర్ణాటక హైకోర్టు!

Kamal Haasan: ప్రజల మనోభావాలు దెబ్బతీయకూడదు.. కమల్‌ హాసన్‌ను ప్రశ్నించిన కర్ణాటక హైకోర్టు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 03, 2025
04:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

'థగ్ లైఫ్' సినిమా విడుదలను నిలిపివేయాలంటూ కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (KFCC) దాఖలు చేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు నేడు విచారించింది. ఈ సందర్భంగా న్యాయస్థానం ప్రముఖ నటుడు కమల్ హాసన్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎంతటి గొప్ప నటుడైనా సరే, ప్రజల మనోభావాలను దెబ్బతీసే హక్కు ఎవ్వరికీ లేదని వ్యాఖ్యానించింది. కమల్‌ హాసన్‌ ఇటీవల 'థగ్ లైఫ్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో "తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై కేవలం సాధారణ ప్రజలు మాత్రమే కాదు, అధికార, విపక్ష పార్టీల నేతలు, కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ కూడా తీవ్రంగా స్పందించారు.

Details

ప్రజాప్రతినిధిగా అలాంటి ప్రకటన చేయకూడదు

దీనికైనా క్షమాపణ చెప్పాలని కోరుతూ, ఆయన సినిమాను కర్ణాటకలో విడుదల చేయకుండా నిషేధించాలంటూ కోర్టును ఆశ్రయించారు.ఈ వ్యవహారంపై విచారణలో హైకోర్టు ప్రశ్నించింది "మీరు కమల్‌ హాసన్ కావచ్చు, కానీ మీరు ఒక ప్రజాప్రతినిధిగా అలాంటి ప్రకటన చేయలేరు. మీ వ్యాఖ్యల వల్ల అసంతృప్తి ఏర్పడింది. కన్నడ ప్రజలు కేవలం క్షమాపణ మాత్రమే అడుగుతున్నారు. మీరు ఏ ప్రాతిపదికన అలాంటి ప్రకటన చేశారు? చరిత్రకారులా? భాషా నిపుణులా?" అని తీవ్రంగా నిలదీసింది. కమల్‌ హాసన్‌ తరఫు న్యాయవాది అది ఉద్దేశపూర్వక వ్యాఖ్య కాదని కోర్టుకు వివరణ ఇచ్చారు. దానికి ప్రతిస్పందంగా న్యాయమూర్తి వ్యాఖ్యానిస్తూ బాధితుడై ఉన్నవాడు, ఆ పరిస్థితులను సృష్టించినవాడు ఇద్దరూ ఒకేలా కాదన్నారు. ఇప్పటికే కమల్ హాసన్ తన అభిప్రాయాన్ని బహిరంగంగా వెల్లడించారు.

Details

పరిష్కారం క్షమాపణలోనే ఉంది

ఇప్పుడు దాన్ని మర్చిపెట్టే ప్రయత్నం చేస్తే కుదరదు. పరిష్కారం క్షమాపణలోనే ఉందని వ్యాఖ్యానించారు. ఇక, కమల్ హాసన్ క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా లేకపోతే, 'థగ్ లైఫ్' సినిమాను కర్ణాటకలో ఎందుకు విడుదల చేయాలనుకుంటున్నారు? వదిలేయాలి. భావవ్యక్తీకరణకు హద్దులు ఉండాలే గానీ, ప్రజల మనోభావాలను దెబ్బతీయడం సరైంది కాదని కోర్టు స్పష్టం చేసింది. "క్షమాపణ చెప్పినట్లయితే ఎటువంటి సమస్య ఉండదు. కర్ణాటకలో సినిమాను ప్రదర్శించి కోట్ల రూపాయల ఆదాయం కూడా పొందవచ్చు. అయినా క్షమాపణ చెప్పకపోతే మీరు తమ రాష్ట్రంలో సినిమాను ఎలా ప్రదర్శించాలనుకుంటున్నార అని కోర్టు ప్రశ్నించింది. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో కమల్‌ హాసన్‌ పరిస్థితిని సమర్థించేందుకు ప్రయత్నించినా, పరిస్థితులు తప్పుదోవ పట్టించిందని ఆయన తరఫు న్యాయవాది అభిప్రాయపడ్డారు.