SLBC Incident: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఘటనపై హైకోర్టులో పిల్.. కార్మికుల రక్షణ కోసం విచారణ
ఈ వార్తాకథనం ఏంటి
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంపై తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకురావాలని నేషనల్ యూనియన్ ఫర్ మైగ్రెంట్ వర్కర్స్ ఈ పిల్ దాఖలు చేసింది.
ఘటన జరిగి 10 రోజులు గడుస్తున్నా కార్మికుల ఆచూకీ తెలియలేదని పిటిషనర్ కోర్టును కోరారు. ఈ కేసులో ప్రభుత్వ తరఫున అడ్వకేట్ జనరల్(ఏజీ) సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు.
సహాయక చర్యల్లో ఆర్మీ, సింగరేణి రెస్క్యూ టీం, ఎన్డీఆర్‌ఎఫ్ (NDRF) పాల్గొంటున్నాయని, 24 గంటల పాటు సహాయక చర్యలు నిరంతరం కొనసాగుతున్నాయని హైకోర్టుకు వివరించారు.
సహాయక చర్యలను ప్రభుత్వం సైతం క్షుణ్ణంగా పర్యవేక్షిస్తోందని వెల్లడించారు. దీంతో హైకోర్టు ఈ వివరాలను నమోదు చేసుకుని, ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణను ముగించింది.
Details
సహాయక చర్యలు కొనసాగుతున్నాయి
తెలంగాణలోని శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ టన్నెల్‌లో ఇటీవల జరిగిన ఘోర ప్రమాదం ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. టన్నెల్ లోపల 8 మంది కార్మికులు చిక్కుకుపోయారు. టన్నెల్ కూలిపోవడం, నీటి ముంపు కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ప్రమాదం జరిగినప్పటి నుంచి ఎన్డీఆర్‌ఎఫ్, రెస్క్యూ టీమ్స్, పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి.
ప్రమాదం జరిగిన ఏడు రోజుల తర్వాత రెస్క్యూ టీం గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ మెషీన్ సహాయంతో మట్టిలో కూరుకుపోయిన ఐదు మృతదేహాలను గుర్తించింది.
మిగతా ముగ్గురి కార్మికుల మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.