
Anirudh Ravichander: అనుమతుల వివాదానికి తెర.. అనిరుధ్ కచేరీకి హైకోర్టు ఆమోదం!
ఈ వార్తాకథనం ఏంటి
యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ప్రపంచవ్యాప్తంగా జరపబోయే 'హుకుమ్' మ్యూజికల్ కచేరీలకు మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆగస్టు 23న చెన్నై సమీపంలోని స్వర్ణభూమి రిసార్ట్స్‌లో ఈ భారీ కచేరీ నిర్వహించనున్నట్టు అనిరుధ్ ఇప్పటికే ప్రకటించగా, టికెట్ బుకింగ్స్ కూడా ప్రారంభమై అభిమానుల్లో విశేష ఉత్సాహం నెలకొంది. అయితే, ఈ కచేరీకి కలెక్టర్ అనుమతి లేకుండా, అవసరమైన సౌకర్యాలు కల్పించకుండా ప్రణాళిక చేస్తున్నారని ఆరోపిస్తూ చెయ్యూర్ నియోజకవర్గ శాసనసభ్యుడు పనైయూర్ బాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Details
కచేరీ కోసం అన్ని పనులు పూర్తి
ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి ఆనంద్ వెంకటేష్ అనిరుధ్ కచేరీకి అనుమతి మంజూరు చేశారు. అయితే ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని తగిన ఏర్పాట్లు తప్పనిసరిగా చేయాలని, అలాగే మహాబలిపురం డీఎస్పీ అనుమతి పొందాలని ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు తీర్పుతో అనిరుధ్ అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది. కచేరీ విజయవంతం కావడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్టు యూనిట్ ప్రకటించింది.