Page Loader
AP High Court: 'మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా?' హైకోర్టులో వైసీపీ నేతపై మండిపాటు
'ఇదేనా మహిళలకు ఇచ్చే గౌరవమా?' హైకోర్టులో వైసీపీ నేతపై మండిపాటు

AP High Court: 'మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా?' హైకోర్టులో వైసీపీ నేతపై మండిపాటు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 16, 2025
09:29 am

ఈ వార్తాకథనం ఏంటి

వైసీపీ నేత, మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. కోవూరు టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై ఆయన చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు కఠినంగా స్పందించింది. మహిళా ఎమ్మెల్యేపై ఇలాంటివి మాట్లాడతారా? మహిళల పట్ల గౌరవం ఇదేనా? అంటూ కోర్టు ప్రశ్నించింది. ఇలాంటి వ్యాఖ్యలను కోర్టు ఎంతమాత్రం ఉపేక్షించబోదని న్యాయస్థానం స్పష్టంచేసింది. ప్రసన్నకుమార్ రెడ్డిపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై మంగళవారం(జూలై 16) విచారణ జరిపేందుకు హైకోర్టు వాయిదా వేసింది. తదుపరి విచారణ వరకు ఆయన వ్యాఖ్యలపై మరింత సమగ్రంగా పర్యవేక్షణ జరగనుంది. కోర్టు స్పష్టం చేసింది. "అనుచిత వ్యాఖ్యలు చేయొద్దు. నియంత్రణలో ఉండాలి. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీరు న్యూసెన్స్ సృష్టించారని వ్యాఖ్యానించింది.

Details

వివాదానికి నాంది ఎలా పలికింది?

జూలై 7న జరిగిన వైసీపీ కోవూరు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో ప్రసన్నకుమార్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె భర్త ప్రభాకర్ రెడ్డికు ఆమె వల్ల ప్రాణహాని ఉందని ఆరోపించారు. అంతేకాదు ఆమెకు స్క్రిప్ట్ ఎవరు రాస్తారో తెలియదు. అవినీతిలో నేను పీహెచ్‌డీ చేశానని అంటున్నారు. ప్రశాంతమ్మ ప్రభాకర్ రెడ్డిని బ్లాక్ మెయిల్ చేసి పెళ్లి చేసుకుంది. జాగ్రత్తగా ఉండు ప్రభాకరన్నా అని అన్న ఆయన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యల అనంతరం అదే రోజు రాత్రి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారు. ఇంట్లోని ఫర్నిచర్, వస్తువులు, కారు ధ్వంసమయ్యాయి.

Details

 ఏపీలో సంచలనం రేపిన ఘటన 

ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. టీడీపీ నేతలు స్పందిస్తూ ఒక మహిళా ప్రజాప్రతినిధి గురించి ఇంత దారుణంగా మాట్లాడతారా? ఇది వైసీపీ నాయకుల మహిళల పట్ల అసలైన వైఖరి. గౌరవం లేదన్న విషయం మరోసారి రుజువైందంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఈ పరిణామాల నేపథ్యంలో న్యాయస్థానానికి చేరిన ఈ వివాదం, హైకోర్టు తీవ్ర వ్యాఖ్యల నేపథ్యంలో మరింత కీలకంగా మారింది. తదుపరి విచారణలో కోర్టు ఏమి చెప్పబోతోందనే ఆసక్తి నెలకొంది.