Actor Darshan: హత్యకేసులో దర్శన్‌కి ఊరట.. హైకోర్టు నుంచి ట్రావెల్ పర్మిషన్!
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటకలో రేణుకాస్వామి హత్యకేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
కన్నడ స్టార్ నటుడు దర్శన్ తూగదీప, అతని అనుచరులు రేణుకాస్వామిని దాడి చేసి హత్య చేసిన ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది.
ఈ కేసులో తాజాగా కర్ణాటక హైకోర్టు దర్శన్‌కు ఊరట కల్పించింది. దేశవ్యాప్తంగా ప్రయాణించేందుకు కోర్టు అనుమతిస్తూ, తదుపరి విచారణను ఏప్రిల్ 8కి వాయిదా వేసింది.
ఇంతకుముందు బెంగళూరు సెషన్స్ కోర్టు దర్శన్‌కు ప్రయాణ పరిమితులు విధించింది.
అయితే, ఈ కేసును సుప్రీంకోర్టు పరిశీలిస్తోందని, తన క్లయింట్ దేశవ్యాప్తంగా ప్రయాణించాల్సిన అవసరం ఉందని దర్శన్ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు.
Details
అప్రూవర్లుగా మార్చేందుకు ఒత్తిడి
అయితే ఆరోగ్య కారణాల పేరుతో బెయిల్ పొందిన దర్శన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రయాణానికి అనుమతి కోరడం పట్ల స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రసన్న కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
అయినా హైకోర్టు దర్శన్‌కు అనుమతి ఇచ్చింది. ఫిబ్రవరి 25న బెంగళూరు స్థానిక కోర్టుకు దర్శన్‌తో పాటు అతని భాగస్వామి పవిత్ర గౌడ, మరో 15 మంది నిందితులు హాజరయ్యారు.
ఈ కేసులో ఇతర నిందితులు తమను అప్రూవర్లుగా మార్చేందుకు పోలీసులు ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు.
రేణుకాస్వామి, దర్శన్‌తో లివింగ్ రిలేషన్‌లో ఉన్నట్లు ఆరోపణలున్నా పవిత్ర గౌడపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశాడు.
Details
131 రోజులు జైల్లో గడిపిన దర్శన్
దీంతో దర్శన్ అనుచరులు అతడిని కిడ్నాప్ చేసి బెంగళూరుకు తీసుకువచ్చి చిత్రహింసలకు గురిచేశారు.
అనంతరం హత్యకు పాల్పడ్డారు. ఈ కేసుకు సంబంధించి దర్శన్, పవిత్ర, మరో 15 మందిని 2024 జూన్ 11న పోలీసులు అరెస్ట్ చేశారు.
131 రోజుల పాటు జైల్లో గడిపిన దర్శన్, అక్టోబర్ 30, 2024న విడుదలయ్యాడు.