
TG High Court: భూదాన్ భూముల వివాదం.. హైకోర్టును ఆశ్రయించిన ఐపీఎస్ అధికారి
ఈ వార్తాకథనం ఏంటి
భూదాన్ భూముల అంశంపై పలువురు ఐపీఎస్ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంపై 24న విచారణ చేపట్టిన న్యాయస్థానం 27 మంది అధికారులకు చెందిన భూములను నిషేధిత జాబితాలో చేర్చాలని ఆదేశించింది.
జస్టిస్ భాస్కర్‌రెడ్డి సింగిల్ బెంచ్ ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ కొందరు ఐపీఎస్ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు.
వీరిలో మహేశ్ భగవత్, స్వాతి లక్రా, సౌమ్యా మిశ్రా ఉన్నారు. భూదాన్ భూముల్లో అక్రమాలు జరగుతున్న నేపథ్యంలో సీబీఐ, ఈడీతో విచారణ జరిపించాలని మహేశ్వరం మండలానికి చెందిన బిర్ల మల్లేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Details
నిషేధిత జాబితాలోకి చేర్చాలని ఆదేశం
ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ సి.వి. భాస్కర్‌రెడ్డి, రికార్డులను పరిశీలించి నాగారంలో ఉన్న 181, 182, 194, 195 సర్వే నంబర్ల భూములు భూదాన్ బోర్డు ఆధీనంలో ఉన్నాయని స్పష్టం చేశారు.
పిటిషన్‌లో ఉన్నతాధికారులపై ఆరోపణలు ఉన్నందున వారి ప్రయోజనాల కోసం అధికార దుర్వినియోగం జరగవచ్చని వ్యాఖ్యానించారు.
హైకోర్టు, సామాజిక ఆస్తుల పరిరక్షణ కోసం ఈ భూములను నిషేధిత జాబితాలో చేర్చాలని ఆదేశించింది.
తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఈ భూముల్లో ఎలాంటి మార్పులు, చేర్పులు జరగకూడదని, అన్యాక్రాంతం చేయడానికి వీలుకాదని ప్రతివాదులను ఆదేశించింది.
ఈ నేపథ్యంలో పలువురు ఐపీఎస్ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు.