LOADING...
Shilpa Shetty: విదేశాలకు వెళ్లాలంటే రూ.60 కోట్లు డిపాజిట్ చేయండి.. శిల్పాశెట్టికి బిగ్ షాక్!
విదేశాలకు వెళ్లాలంటే రూ.60 కోట్లు డిపాజిట్ చేయండి.. శిల్పాశెట్టికి బిగ్ షాక్!

Shilpa Shetty: విదేశాలకు వెళ్లాలంటే రూ.60 కోట్లు డిపాజిట్ చేయండి.. శిల్పాశెట్టికి బిగ్ షాక్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 08, 2025
04:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఓ వ్యాపారవేత్తను రూ.60 కోట్ల మేర మోసం చేసిన కేసులో నటి శిల్పాశెట్టి దంపతులు విచారణకు ఎదురు కావడమే కాకుండా, ముంబయి పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (ఎఫ్‌ఐయు) వారు లుకౌట్‌ నోటీసులు (ఎల్‌వోసీ) జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి శిల్పాశెట్టి దంపతులు విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు. తాజాగా, హైకోర్టు ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. నటి శిల్పాశెట్టి దంపతులు విదేశాలకు వెళ్లడానికి అనుమతి ఇవ్వమని కోర్టు స్పష్టంగా పేర్కొంది, దేశాన్ని విడిచి వెళ్లాలంటే ముందుగా రూ.60 కోట్లు డిపాజిట్ చేయాలి.

Details

హైకోర్టు అనుమతి ఉండాల్సిందే

ఆ డిపాజిట్ పూర్తి చేసిన తర్వాత మాత్రమే తదుపరి విచారణ కొనసాగుతుంది. శిల్పాశెట్టి కోలంబోలో ఒక యూట్యూబ్‌ ఛానల్ నిర్వహించే కార్యక్రమంలో అక్టోబరు 25 నుంచి 29 వరకు పాల్గొననుందట. లుకౌట్‌ నోటీసులు ఉన్న నేపథ్యంలో ఆమె కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఈవెంట్ నిర్వాహకుల నుంచి అధికారిక ఆహ్వానం ఉందా?" అని ప్రశ్నించగా,ప్రస్తుతం కేవలం ఫోన్‌కాల్‌ ద్వారా సమాచారం మాత్రమే అందుబాటులో ఉందని శిల్పాశెట్టి లాయర్ తెలిపారు. హైకోర్టు అనుమతి ఇచ్చిన తరువాతే, వెళ్లాలని స్పష్టం చేసింది.