
Teacher Jobs: ఏపీలో 2,505 కొత్త ఉద్యోగాలు.. టీచర్లకు, కోర్టు ఉద్యోగాలకు కేబినెట్ ఆమోదం
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. పాఠశాల విద్యా శాఖ, న్యాయ శాఖలకు సంబంధించి మొత్తం 2,505 ఉద్యోగాలను కల్పించేందుకు ఆమోదం తెలిపింది.
2,260 టీచర్ పోస్టులకు మంత్రివర్గ ఆమోదం
పాఠశాల విద్యా శాఖలో 2,260 పోస్టుల కల్పనకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇందులో భాగంగా
1136 SGTs (సెకండరీ గ్రేడ్ టీచర్లు)
1124 స్కూల్ అసిస్టెంట్లు (పాఠశాల సహాయకులు)
ఈ పోస్టులు ఇప్పటికే ఖాళీగా ఉన్న అదనపు పోస్టులుగా మార్చడం జరిగింది. ఏప్రిల్ 15న ప్రభుత్వం జారీ చేసిన G.O.Ms.No.13కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఈ నియామకాలు W\.P.(C) నెం. 132/2016 కింద భారత సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ఆధారంగా చేపట్టారు.
Details
ప్రత్యేక అవసరాల విద్యార్థుల కోసం ప్రత్యేక ఉపాధ్యాయులు
ప్రత్యేక అవసరాలున్న విద్యార్థుల విద్యాపై మరింత దృష్టి పెట్టేందుకు ఈ నియామకాలు కీలకంగా ఉంటాయని మంత్రివర్గం అభిప్రాయపడింది.
మేధోపరమైన, అభ్యాస వైకల్యాలున్న విద్యార్థులకు విద్యా హక్కులను పునరుద్ధరించడంతోపాటు, సమానత్వాన్ని ప్రోత్సహించడమే ప్రభుత్వ ఉద్దేశ్యం.
హైకోర్టులో 245 పోస్టులు: న్యాయ శాఖ ప్రతిపాదనకు ఆమోదం
ఇక న్యాయ శాఖ (హోమ్-కోర్టులు) ప్రతిపాదించిన ప్రకారం, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వివిధ కేటగిరీల్లో 245 పోస్టులు మంజూరయ్యాయి.
Details
ముఖ్యమైన పోస్టులివే
జడ్జి స్థాయిలో రిజిస్ట్రార్ (జ్యుడీషియల్-II), రిజిస్ట్రార్ (ఇన్ఫ్రాస్ట్రక్చర్)
ఎడిటర్, జాయింట్ రిజిస్ట్రార్లు, డిప్యూటీ రిజిస్ట్రార్లు, కోర్ట్ ఆఫీసర్లు
అకౌంట్స్ ఆఫీసర్, డిప్యూటీ సెక్షన్ ఆఫీసర్, ట్రాన్స్‌లేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు
సిస్టమ్ ఆఫీసర్లు, సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, UI డిజైనర్లు, మాడ్యూల్ లీడర్లు
ఈ పోస్టుల భర్తీ ద్వారా హైకోర్టు కార్యనిర్వాహణ సామర్థ్యం పెరగడం సహా, న్యాయపరమైన సేవలు మరింత వేగంగా, సమర్థవంతంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఇకపోతే, విద్యా, న్యాయ రంగాల్లో ఈ నియామకాలు ప్రభుత్వ సంకల్పానికి నిదర్శనంగా నిలుస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు.