LOADING...
Telangana: బీసీ రిజర్వేషన్ల జీఓపై సుప్రీంకోర్టులో సవాలు.. అర్ధరాత్రి పిటిషన్ దాఖలు
బీసీ రిజర్వేషన్ల జీఓపై సుప్రీంకోర్టులో సవాలు.. అర్ధరాత్రి తెలంగాణ పిటిషన్ దాఖలు

Telangana: బీసీ రిజర్వేషన్ల జీఓపై సుప్రీంకోర్టులో సవాలు.. అర్ధరాత్రి పిటిషన్ దాఖలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 14, 2025
11:23 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ జారీ చేసిన జీవోపై హైకోర్టు ఇచ్చిన స్టేను రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను నిలిపివేయాలని కోరుతూ సోమవారం అర్ధరాత్రి అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. పెంచిన రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలని ప్రధానమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ కృతనిశ్చయంతో ఉండటంతో ఈ వ్యవహారం దిల్లీకి చేరింద . గత కొన్ని రోజులుగా ఈ అంశంపై ప్రభుత్వం తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తోంది.

Details

హైకోర్టు స్టే ఇవ్వడం బాధాకరం

సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క్, మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, న్యాయవాదులు సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, రవి వర్మ జూమ్ ద్వారా సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ పిటిషన్ గురువారం లేదా శుక్రవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. తమ వాదనలు వినకుండానే హైకోర్టు జీఓ 9పై స్టే విధించింది. ప్రత్యేక కమిషన్ నివేదిక, జనాభా నిష్పత్తి ఆధారంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా హైకోర్టు స్టే ఇవ్వడం బాధాకరమని, సుప్రీంకోర్టులో మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం మహేశ్ గౌడ్ స్పష్టం చేశారు.