తదుపరి వార్తా కథనం

Ilayaraja: 'గుడ్ బ్యాడ్ అగ్లీ'కి షాక్.. ఇళయరాజా పాటల వినియోగంపై హైకోర్టు స్టే!
వ్రాసిన వారు
Jayachandra Akuri
Sep 09, 2025
10:47 am
ఈ వార్తాకథనం ఏంటి
'గుడ్ బ్యాడ్ అగ్లీ' చిత్రంలో సంగీత దర్శకుడు ఇళయరాజా స్వరపరిచిన పాటలను ఉపయోగించరాదంటూ మద్రాస్ హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. ఇళయరాజా తరఫున దాఖలైన పిటిషన్‌లో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో అజిత్ నటిస్తున్న ఈ సినిమాలో, తన అనుమతి లేకుండా తాను కంపోజ్ చేసిన పాటలను వాడినట్లు పేర్కొన్నారు. ఇది కాపీరైట్ చట్టానికి విరుద్ధమని, సంబంధిత పాటలను వెంటనే తొలగించాలని, వాటిని అనుమతి లేకుండా ఉపయోగించినందుకు తగిన పరిహారం చెల్లించాలంటూ ఇళయరాజా డిమాండ్ చేశారు.
Details
నిర్మాణ సంస్థకు నోటీసులు
ఈ పిటిషన్ సోమవారం జస్టిస్ సెంథిల్‌కుమార్ ధర్మాసనంలో విచారణకు వచ్చింది. వాదనలు విన్న న్యాయమూర్తి, మధ్యంతర స్టే ఆదేశాలు జారీ చేస్తూ, నిర్మాణ సంస్థకు నోటీసులు పంపించారు. పిటిషన్‌పై నిర్మాతల నుంచి జవాబు తీసుకోవాలని ఆదేశించి, తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు.