Posani Krishna Murali: పోసాని క్వాష్ పిటిషన్ తిరస్కరణ.. మిగతా కేసుల్లో నోటీసులిచ్చేలా ఆదేశం!
ఈ వార్తాకథనం ఏంటి
సినీ నటుడు పోసాని కృష్ణమురళి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
విజయవాడ పోలీసులు నమోదు చేసిన కేసులో పీటీ వారెంట్ అమలు చేశామని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలియజేయగా, ఈ కేసును రద్దు చేయాలన్న పోసాని పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది.
ఇక విజయనగరం, గుంటూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల పోలీసుల కేసుల్లో 34 BNS ప్రకారం నోటీసు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
విశాఖపట్నంలో నమోదైన మరో కేసు రద్దు చేయాలన్న పోసాని పిటిషన్‌పై విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది.
Details
కర్నూలు జైలుకు తరలించిన పోలీసులు
కడప మొబైల్ కోర్టు ఇప్పటికే ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో పోసానికి బెయిల్ మంజూరు చేసింది.
అయితే మిగతా కేసుల్లో బెయిల్ రాకపోవడంతో ఆయన జైలులోనే కొనసాగుతున్నారు. ఇక పోసాని బెయిల్ పిటిషన్‌పై ఈరోజు కర్నూలు JFCM కోర్టులో విచారణ జరగనుంది.
ఇదే సమయంలో, కస్టడీ పిటిషన్‌పై తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌లను దూషించారనే ఫిర్యాదుతో ఆదోని టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
ఈ నేపథ్యంలో పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచి అనంతరం కర్నూలు జైలుకు తరలించారు.
ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లు, జైలులను చుట్టివచ్చిన ఆయన భవిష్యత్‌పై ఆసక్తి నెలకొంది.