తదుపరి వార్తా కథనం

TG High Court: తెలంగాణ హైకోర్టుకు కొత్తగా నలుగురు అదనపు న్యాయమూర్తులు నియామకం
వ్రాసిన వారు
Jayachandra Akuri
Jul 29, 2025
09:28 am
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ హైకోర్టులో కొత్తగా నలుగురు అదనపు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు. న్యాయవాదుల కోటాలో భాగంగా గౌస్ మీరా మొహినుద్దీన్, సుద్దాల చలపతిరావు, వాకిటి రామకృష్ణారెడ్డి, గాడి ప్రవీణ్‌కుమార్‌లను అదనపు న్యాయమూర్తులుగా నియమించేందుకు సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులను కేంద్రం ఆమోదించింది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తద్వారా వీరు అధికారికంగా హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. ఈ నలుగురితోపాటు అదనపు సొలిసిటర్ జనరల్ నరసింహశర్మ కూడా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మర్యాదపూర్వకంగా కలిశారు. అధికారిక సమాచారం మేరకు, కొత్తగా నియమితులైన న్యాయమూర్తులు ఈ నెల 31వ తేదీన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.