NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Kunal Kamra: డిప్యూటీ సీఎం షిండేపై వ్యాఖ్యలు.. కునాల్ కమ్రాపై మరో 3 కేసులు
    తదుపరి వార్తా కథనం
    Kunal Kamra: డిప్యూటీ సీఎం షిండేపై వ్యాఖ్యలు.. కునాల్ కమ్రాపై మరో 3 కేసులు
    డిప్యూటీ సీఎం షిండేపై వ్యాఖ్యలు.. కునాల్ కమ్రాపై మరో 3 కేసులు

    Kunal Kamra: డిప్యూటీ సీఎం షిండేపై వ్యాఖ్యలు.. కునాల్ కమ్రాపై మరో 3 కేసులు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 29, 2025
    02:45 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా మరింత ఇబ్బందుల్లో పడుతున్నారు. మహారాష్ట్రలో ఆయనపై తాజాగా మూడు కేసులు నమోదయ్యాయి.

    డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేపై చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. షిండేను ఉద్దేశించి 'ద్రోహి' అంటూ సంబోధించడంతో శివసేన కార్యకర్తలు భగ్గుమన్నారు.

    దీనికి ప్రతిగా కునాల్ కమ్రా నిర్వహించిన క్లబ్‌పై కార్యకర్తలు దాడి చేశారు. అనంతరం ఆయనపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం కునాల్ కమ్రా తమిళనాడులో ఉన్నారు.

    ముంబై పోలీసులు పలుమార్లు సమన్లు జారీ చేసినా ఆయన హాజరుకాలేదు. అరెస్ట్ చేయాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వం ముంబై పోలీసులపై ఒత్తిడి తెస్తున్నా ఇప్పటివరకు సాధ్యం కాలేదు.

    Details

    మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన కమ్రా

    ఈ నేపథ్యంలో కమ్రా అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలంటూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.

    హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కునాల్ కమ్రా వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే తీవ్రంగా స్పందించారు. సుపారీ ఇచ్చి మాట్లాడించినట్లు ఉందని షిండే వ్యాఖ్యానించారు.

    శివసేన కార్యకర్తల దాడిని సమర్థించనని, కానీ న్యూటన్ సిద్ధాంతం ప్రకారం చర్యకు ప్రతి చర్య ఉంటుందని వ్యాఖ్యానించారు.

    మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కూడా కునాల్ కమ్రా వ్యాఖ్యలను ఖండించి, షిండేకు మద్దతుగా నిలిచారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మద్రాస్
    హైకోర్టు

    తాజా

    Kannappa: 'కన్నప్ప' ఫైనల్ చాప్టర్.. కామిక్ బుక్ చివరి అధ్యాయం రిలీజ్ కన్నప్ప
    Trump pakistan deal : పాకిస్థాన్ క్రిప్టో కౌన్సిల్‌తో అమెరికా ఒప్పందం.. ట్రంప్ ఫ్యామిలీ,పాక్ ఆర్మీ చీఫ్‌కి లింకులు! అమెరికా
    Airtel Fraud Detection: ఎయిర్‌టెల్‌ వినియోగదారులకు శుభవార్త.. ఉచితంగా 'ఫ్రాడ్‌ డిటెక్షన్‌' ఫీచర్‌ అందుబాటులోకి! ఎయిర్ టెల్
    Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 200, నిఫ్టీ 42 పాయింట్లు చొప్పున నష్టం  స్టాక్ మార్కెట్

    మద్రాస్

    విదేశాల్లో తొలి ఐఐటీ ఏర్పాటుకు ఒప్పందం.. జాంజిబార్‌లో ఐఐటీ మద్రాస్ క్యాంపస్  టాంజానియా
    సనాతన ధర్మంపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. వాక్ స్వాతంత్య్రం విద్వేషం కాకూడదు హైకోర్టు

    హైకోర్టు

    Karnataka: కర్ణాటక హైకోర్టులో వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. షాకైన సిబ్బంది  కర్ణాటక
    Court Judges -Letter-CJI: న్యాయ వ్యవస్థను దెబ్బతీసేందుకు కొన్నిశక్తులు ప్రయత్నిస్తున్నాయి: సీజేఐకు రిటైర్డ్ సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీలు లేఖ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
    Janasena-Election symbol-Glass-Court: జనసేన పార్టీకి ఏపీ హైకోర్టులో ఊరట జనసేన
    Teachers jobs-Calcutta High court: అక్రమంగా ఉద్యోగాలు పొందారు..డబ్బులు తిరిగి చెల్లించండి: కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు పశ్చిమ బెంగాల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025