
Delhi High Court: రూహ్ అఫ్జాపై అనుచిత వ్యాఖ్యలు.. బాబా రాందేవ్‌పై ఢిల్లీ హైకోర్టు సీరియస్
ఈ వార్తాకథనం ఏంటి
పతంజలి వ్యవస్థాపకుడు బాబా రాందేవ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ప్రముఖ ఫార్మసీ సంస్థ హమ్దర్ద్‌కు చెందిన పాపులర్ డ్రింక్ రూహ్ అఫ్జాపై రాందేవ్ చేసిన వ్యాఖ్యలను హైకోర్టు ఖండించింది.
ఈ శర్బత్‌ను ఆయన షర్బత్ జిహాద్‌గా పేర్కొనడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో హమ్దర్ద్ సంస్థ రాందేవ్‌పై పరువు నష్టం కేసు దాఖలు చేసింది.
దీనిపై సోమవారం విచారణ జరిపిన జస్టిస్ అమిత్ బన్సల్, రాందేవ్ వ్యాఖ్యల పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఇది కోర్టు అంతరాత్మనే షాక్‌కు గురిచేసే స్థాయిలో ఉంది. క్షమించలేని విషయమంటూ కఠిన వ్యాఖ్యలు చేశారు.
Details
కంపెనీ పరువు దెబ్బతింది
గత ఏప్రిల్ 3న బాబా రాందేవ్ తన కంపెనీ గులాబ్ షర్బత్ ఉత్పత్తికి ప్రచారం చేస్తూ రూహ్ అఫ్జాపై విమర్శలు గుప్పించారు.
హమ్దర్ద్ కంపెనీ తమ లాభాలను మసీదులు, మదర్సాలు నిర్మించేందుకు ఖర్చుచేస్తోందని ఆరోపించారు. ఇదే సందర్భంలో షర్బత్ జిహాద్ అనే పదాన్ని ఉపయోగించారు.
రాందేవ్ చేసిన ఈ వ్యాఖ్యలు సంస్థపై మాత్రమే కాకుండా సంస్థ యజమానుల మత విశ్వాసాలపై దాడిగా అభిప్రాయపడుతూ, హమ్దర్ద్ తరఫున సీనియర్ న్యాయవాది ముఖుల్ రోహత్గీ కోర్టులో వాదనలు వినిపించారు.
ఆయన వ్యాఖ్యల వల్ల కంపెనీ పరువు దెబ్బతిందని, ప్రజల్లో అపోహలు కలుగుతున్నాయని తెలిపారు.
ఈ నేపథ్యంలో రాందేవ్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టిన హైకోర్టు, ఆయనకు గట్టి హెచ్చరిక జారీ చేసింది.