Delhi excise policy case : దిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్,సిసోదియా,కవితకు భారీ ఊరట
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీ ఎక్సైజ్ విధానానికి సంబంధించిన కేసులో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత లకు భారీ ఊరట లభించింది. ఈ కేసుపై తాజా విచారణ చేపట్టిన Rouse Avenue Court నిందితులపై నమోదు చేసిన అన్ని కేసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అదేవిధంగా, వారందరినీ అధికారికంగా కేసు నుంచి విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. తగిన ఆధారాలు లేకుండానే వారి పేర్లు ఈ వ్యవహారంలో చేర్చినట్లు పేర్కొంటూ సీబీఐ చర్యలపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. మొత్తం 22 మందిపై నమోదైన అభియోగాలను కొట్టివేసి, ఈ వ్యవహారం నుంచి వారికి పూర్తిస్థాయి విముక్తి కల్పిస్తున్నట్లు న్యాయస్థానం స్పష్టం చేసింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
దిల్లీ ఎక్సైజ్ వ్యవహారంలో కీలక మలుపు
#Breaking
— Bar and Bench (@barandbench) February 27, 2026
[Delhi excise policy case]
Delhi court discharges AAP leaders Arvind Kejriwal, Manish Sisodia and many others in the CBI case.
"There was no overarching conspiracy or criminal intent in the excise policy," the Court rules. @ArvindKejriwal @msisodia @AamAadmiParty pic.twitter.com/MHCDdNjAUo